మ్యూజిక్ కోసం యుట్యూబ్ లో ఛానల్ స్టార్ట్ చేయబోతున్న స్టార్ హీరోయిన్

కమల్ హసన్ కూతురు అనే ట్యాగ్ తో సౌత్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శృతి హసన్.అయితే తండ్రి ఇమేజ్ తో వచ్చిన ఈ అమ్మడు అతి కొద్ది కాలంలోనే తన బ్రాండ్ చూపించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.గబ్బర్ సింగ్ తో ఒక్కసారిగా శృతి స్టార్ మారిపోయింది.వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఆడిపాడే అవకాశం దక్కించుకుంది.అటు తమిళంలో కూడా స్టార్ హీరోలతో జత కట్టింది.ఇక హీరోయిన్ గా తన గ్లామర్, నటనతో కట్టిపడేసిన ఈ అమ్మడుకి మరొక టాలెంట్ కూడా ఉంది.

 Shruti Haasan Starts Her Youtube Channel, Tollywood, Telugu Cinema, South Cinema-TeluguStop.com

అది సింగింగ్.గాయనిగా కూడా ఈ అమ్మడు చాలా సినిమాలకి పాటలు పాడింది.

వాటిలో సూపర్ హిట్ అయినవి కూడా ఉన్నాయి.అలాగే ఈమె మంచి మ్యూజిషియన్ కూడా.

ఈ నేపధ్యంలో ఎక్కువగా విదేశాలలో రాక్ బ్యాండ్ ఈవెంట్స్ కూడా చేసింది.స్టేజి షోలు కూడా ఇచ్చింది.

ఆల్బమ్స్ తో కూడా శృతి సందడి చేసింది.తనలో మంచి డాన్సర్ కూడా ఉంది.

ఇలా మల్టీ టాలెంట్ అయిన శృతి హసన్ తనని తాను షో అప్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక యుట్యూబ్ చానల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతుంది.ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేసింది.

ప్రస్తుతం శృతి తను సొంతంగా రూపొందించిన ఫస్ట్ ఆల్బమ్ కోసం వర్క్ చేస్తోంది.ఈ సందర్భంగా శృతి మాట్లాడుతూ నేను సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా మాట్లాడాను.

త్వరలోనే ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి అభిమానులకు మరింత దగ్గర అవ్వాలని ఆలోచిస్తున్నా అని తెలిపింది.ఇక యూట్యూబ్ ఛానల్ కంటెంట్ గురించి మాట్లాడుతూ ఈ ఛానల్లో ఇకపై నా సొంత ట్రాక్స్ అప్లోడ్ చేస్తాను.

బిటిఎస్ ఫుటేజ్ తో పాటు నా ప్రదర్శనలు, మ్యూజికల్ టూర్స్ కి సంబంధించి అన్నీ వీడియోలు అందులోనే ఉంటాయి అని చెప్పుకొచ్చింది.మొత్తానికి తాను చేసే ఆల్బమ్స్ ని, మ్యూజిక్ ఈవెంట్స్ ప్రేక్షకులకి మరింత దగ్గర చేయడం కోసం ఈ అమ్మడు కూడా డిజిటల్ మీడియాని వాడుకోవడానికి రెడీ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube