రోజురోజుకూ దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే.అటు మహారాష్ట్ర,ఢిల్లీ ల్లో కరోనా కేసులు మరింత పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో తమ ఆసుపత్రుల్లో బెడ్లన్నీ నిండుకున్నాయని, ఇకపై వచ్చే రోగులకు చికిత్స చేసేందుకు బెడ్లు లేవంటూ న్యూఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రులు అంటున్నాయి.ఢిల్లీలో కరోనా చికిత్సలు అందిస్తున్న మ్యాక్స్ హాస్పిటల్స్, ఫోర్టిస్ హాస్పిటల్స్, హోలీ ఫ్యామిలీ హాస్పిటల్స్, తమ ఆసుపత్రులు నిండిపోయాయని అంటున్నాయి.
అయితే మరోపక్క ఢిల్లీ ప్రభుత్వం మాత్రం బెడ్లకు కొరత లేదని అధికారిక యాప్ లో మాత్రం చూపిస్తుండటం గమనార్హం.ఢిల్లీ ప్రభుత్వం కరోనాపై సమాచారాన్ని అందిస్తున్న ‘ఢిల్లీ కరోనా’ యాప్ లో ఫోర్టిస్ గ్రూప్ ఆసుపత్రుల్లో 32 బెడ్లు ఖాళీ ఉన్నట్టు చూపిస్తుండగా, ఆ ఆసుపత్రి యాజమాన్యం మాత్రం “ప్రస్తుతం మా వద్ద ఏ బెడ్ కూడా ఖాళీగా లేదు.
ఐసీయూ సైతం నిండిపోయింది.ఆ యాప్ లో ఏదో సమస్య ఉంది” అంటూ వ్యాఖ్యానించడం విశేషం.
అలానే మరో ప్రైవేట్ ఆసుపత్రి హోలీ ఫ్యామిలీ వర్గాలు కూడా ఇదే విధమైన సమాచారాన్ని అందించడం గమనార్హం.యాప్ లో వివరాలు అప్ డేట్ కావడం లేదని అందుకే అలా చూపిస్తుంది అంటూ అంటూ వారు చెబుతున్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,46,628కి చేరగా,6929మంది కోవిడ్ వల్ల మృతి చెందారు.రోజు రోజుకు ఈ కేసులు సంఖ్య మరింత పెరుగుతుండడం తో ఆందోళన నెలకొంటుంది.
ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ లాక్ డౌన్ సడలింపులతో కరోనా కేసులు పెరిగిపోయాయి.మరి ఈ తాజా పరిణామాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.