కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయడంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.దీంతో విదేశాలలో ఉన్న భారతీయులు రెండు నెలల పాటు విమాన సర్వీసులు లేకపోవడంతో అక్కడే ఉండిపోయారు.
దీనిలో సినీ, క్రీడా ప్రముఖులు కూడా ఇతర దేశాలలో లాక్ డౌన్ కారణంగా ఉండిపోయారు.అలాగే భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కూడా కరోనా కారణంగా జర్మినీలో చిక్కుకుపోయారు.
లాక్ డౌన్ ప్రకటించకముందు ఓ టోర్నీ ఆడేందుకు యూరప్ వెళ్లిన ఆనంద్ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ విమానసర్వీసులు నిలిచిపోవడంతో జర్మనీలో ఉండిపోవాల్సి వచ్చింది.
దాదాపు మూడు నెలలుగా జర్మనీలో కాలం గడిపిన ఆనంద్ ఇటీవలే భారత్ వచ్చాడు.
అయితే ప్రోటోకాల్ ప్రకారం బెంగళూరులో వారం రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుని తాజాగా ఇంటికి చేరుకున్నాడు.చెన్నైలో తన నివాసానికి చేరుకున్న వెంటనే ఈ లెజెండరీ ప్లేయర్ తన కుమారుడు అఖిల్ ను చూసి భావోద్వేగాలకు గురయ్యాడు.
సుదీర్ఘ విరామం తర్వాత కొడుకుని చూడడం ఆనందం కలిగిస్తోందని తెలిపాడు.మొత్తానికి ఇతర దేశాలలో చిక్కుకుపోయి ఇండియా వచ్చిన ప్రముఖులు కుటుంబాన్ని చూసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.