ఓ వ్యక్తి కరోనాతో పోరాడి జయించాడు.ఆరోగ్యంలోనూ.
మానవత్వంలోనూ సత్తా చాటాడు.కరోనాతో క్యూర్ అయిన తర్వాత ఏకంగా ఏడు సార్లు ప్లాస్మాను డొనేట్ చేసి అందరికి ఆదర్శంగా నిలిచాడు.
ఇన్ని సార్లు ప్లాస్మా దానం చేసినా అవకాశం ఉంటే ఇంకా చేస్తానని నివ్వెరబోయే సమాధానాలు ఇస్తున్నాడు.
దేశ రాజధాని ఢిల్లీకి చెందిన తబ్రేజ్ ఖాన్ (37) కరోనాతో బాధపడుతూ చికిత్స చేయించుకున్నాడు.
కరోనాతో క్యూర్ అయిన తర్వాత ప్లాస్మా కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రకటన చేసింది.దీంతో తొలిసారిగా ప్లాస్మా డొనేట్ చేసిన వ్యక్తిగా ఆయన నిలిచాడు.అప్పటి నుంచి ప్లాస్మా కావాలని ఫోన్లు రావడంతో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ మొత్తంగా ఆరుసార్లు ప్లాస్మా దానం చేశాడు.14 రోజులు కిందటే ప్లాస్మాదానం చేసిన ఆయన మరోసారి దానం చేయడంతో ఏడు సార్లు పూర్తి చేసుకున్నాడు.
అయితే, అంతలా ప్లాస్మా దానం చేయడానికి కారణం ఏంటని అతడిని డాక్టర్లు ప్రశ్నించగా… ‘ మీరు ప్లాస్మా దానం చేసిన పేషంట్ కోలుకున్నాడు సార్’ అని హాస్పిటల్ నుంచి వస్తున్న కాల్సే అని సమాధానం ఇచ్చాడు.కోవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని, అవసరమైతే ఎన్ని సార్లు అయినా ప్లాస్మా దానం చేయడానికి సిద్ధమన్నాడు.