మంచిర్యాల జిల్లా ఆస్పత్రిలో శిశువుల తారుమారు వివాదం కొనసాగుతోంది.దీంతో ఆస్పత్రిలో తల్లిదండ్రులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువులు తారుమారైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఒకే రోజు ఇద్దరు గర్భిణులకు వైద్యులు డెలివరీ చేశారు.
అయితే ఆస్పత్రి సిబ్బంది ఒకరి బిడ్డను మరొకరికి ఇచ్చినట్లు తెలుస్తోంది.శిశువులను మార్చడంతో కుటుంబీకులు నిరసనకు దిగారు.
ఈ క్రమంలో స్పందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ చిన్నారులను శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు.డీఎన్ఏ టెస్ట్ నిర్వహించిన తర్వాతే చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగిస్తామని తెలిపారు.