హైదరాబాద్ లో ఓయూ విద్యార్థి అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.కొడంగల్ సభలో కించపరిచే వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో నరేశ్ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులు భగ్గుమన్నారు.హైదరాబాద్ తో పాటు పలు జిల్లా కేంద్రాల్లో భారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమాల్లో అయ్యప్ప మాలధారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నరేశ్ ను అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నారు.
అదేవిధంగా నరేశ్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు.ఈ క్రమంలో 24 గంటలలోపు అరెస్ట్ చేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
అంతేకాకుండా లక్షలాది మందితో ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని వీహెచ్పీ హెచ్చరించింది.