టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు.చెల్లని కాయిన్ అని చంద్రబాబు అనుకుంటే అయిపోద్దా అని ప్రశ్నించారు.
నియోజకవర్గాల మార్పులు రాజకీయాల్లో కొత్త కాదని మంత్రి బొత్స తెలిపారు.బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం ఇచ్చేందుకే మార్పులని పేర్కొన్నారు.
అదేవిధంగా మంచి ఫలితాల కోసమే మార్పులు చేస్తున్నామన్నారు.మద్యపాన నిషేధంపై తమకో విధానం ఉందన్న మంత్రి బొత్స అలానే చేస్తున్నట్లు వెల్లడించారు.
మద్యం తాగకుండా పబ్లిక్ లో పరివర్తన తెస్తున్నామని తెలిపారు.చంద్రబాబుకు కుప్పం సీటే దిక్కు లేదన్న ఆయన జాకీలు పెట్టినా టీడీపీ లేవడం లేదని విమర్శించారు.
మూడు నెలల తరువాత టీడీపీ అసలు ఉండదని తెలిపారు.చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే రెండు చోట్ల పోటీ చేస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు.
అలాగే ఏపీ కాంగ్రెస్ మాట్లాడటం కూడా టైమ్ వేస్ట్ అని తెలిపారు.