కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు.కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని గతంలో కాంగ్రెస్ డిమాండ్ చేసిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిందన్న రఘునందన్ గతంలో అడిగినట్లుగానే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.అలాగే సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న రఘునందన్ రావు విచారణ మేడిగడ్డ వరకే పరిమితం చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు.