టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సలార్( Salaar movie ).కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో డిసెంబర్ 22న విడుదల కాబోతోంది.హోం భలే సంస్థ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలను నెల కొన్నాయి.

ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్న చిత్ర బృందం మరింత వేగవంతం చేసింది.ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధిస్తే కోట్లలో వసూళ్లను సాధించడం ఖాయం అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు.అయితే తాజాగా వచ్చిన యాక్షన్ ట్రైలర్ తో ఒక్కసారిగా రీసౌండ్ పెరిగింది.
ఈ ప్రపంచంలోకి ఆడియన్స్ కూడా వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే ఇంట్రెస్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతోంది.
సలార్- కేజీఎఫ్ కనెక్షన్.ఇది అసలు మ్యాటర్ ఇదే స్పీడ్ కొనసాగితే కచ్చితంగా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సలార్ రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

అలాగే సలార్ ముందు పెద్ద టార్గెట్ ఉంది.ప్రశాంత్ నీల్ ముందు సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2( KGF 2 ) ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేసింది.ఈ రికార్డుని సలార్ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సినిమాపై ఉన్న హైప్ చూస్తుంటే కచ్చితంగా బ్రేక్ చేయడానికి కావాల్సిన స్కోప్ ఉంది.ప్రభాస్ ఆదిపురుష్ మూవీ కూడా వంద కోట్లకి పైగా కలెక్ట్ చేసింది.అయితే సలార్ మాస్ , యాక్షన్ మూవీ కావడంతో 150 కోట్లు చాలా ఈజీగా దాటేస్తుంది అని అంచనా వేస్తున్నారు.170 కోట్ల మార్క్ ని సలార్ అందుకుంటే మాత్రం ఈ ఏడాది హైయెస్ట్ గ్రాస్ అందుకున్న మూవీగా నిలిచిపోతుంది.అలాగే వెయ్యి కోట్ల కలెక్షన్స్ టార్గెట్ కూడా సలార్ ముందు ఉంది.







