అమెరికాలో మళ్ళీ పేలిన తూటా..బాలిక మృతి

అమెరికాలో రోజుకో చోట తుపాకి పేలుళ్ళ చెప్పుళ్ళు వినిపిస్తూనే ఉంటాయి.తుపాకీ సంస్కృతీ హెచ్చుమీరుతున్న అమెరికాలో ఇలాంటి ఘటనలు సర్వ సాధారణమే.

 Concord Mills Mall Shooting Teen Girl Killed-TeluguStop.com

అయితే ఈ గన్ కల్చర్ వలన ఎంతో మంది అమాయక ప్రజలు బలై పోతున్నారు.తాజాగా అమెరికాలో జరిగిన ఓ ఘటనలో అభం శుభం తెలియని ఓ బాలిక మృతి చెందింది.

స్థానికంగా ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది.వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో వరుస కాల్పులు అమెరికా వాసులని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.ఈ మధ్య కాలంలో అంటే ఈ నెలలో అమెరికాలో వివిధ ప్రాంతాలలో కాల్పుల ఘటనలు పోల్చుకుంటే తాజాగా జరిగిన ఘటన మూడవ ఘటనగా తెలుస్తోంది.

నార్త్ కరోలినాలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాంకర్డ్ మిల్స్ మాల్ పార్కింగ్ ప్రాంతానికి వచ్చాడు.ఉన్నట్టుండి ఒక్క సారిగా తన వద్దనున్న తుపాకి తీసుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు

Telugu Concord Mills, Concord, Teen-

ఈ ఘటనలో అక్కడ ఉన్న ఓ బాలిక చనిపోగా ఇద్దరు బాలురు తీవ్ర గాయాలపాలయ్యారు.వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.కాల్పులు సమయంలో అతడు ఒక్కడే వచ్చాడని, ఒక కారులో దిగిన అతడు వెంటనే దాడి చేశాడని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.

ఈ ఘటనపై విచారణ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube