ఏపీలో పలు విద్యుత్ ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన

ఏపీలో పలు విద్యుత్ ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.ఈ మేరకు రూ.6,500 కోట్లతో కొత్త సబ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.

 Cm Jagan Laid Foundation Stone For Many Power Projects In Ap-TeluguStop.com

హెచ్‎పీసీఎల్ తో రూ.10 వేల కోట్ల ఎంవోయూ కుదిరిందని తెలుస్తోంది.దాదాపు 1500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.

మొత్తం 28 సబ్ స్టేషన్లలో 12 సబ్ స్టేషన్లను ప్రారంభించామని సీఎం జగన్ తెలిపారు.మరో 16 సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు.850 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుతో 1700 ఉద్యోగాలు వస్తున్నాయన్నారు.వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.

ఈ క్రమంలో 14 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోందని వెల్లడించారు.మరో 25 ఏళ్ల పాటు ఢోకా లేకుండా రైతులకు ఉచిత విద్యుత్ అందుతుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube