ఒకవైపు అధికార పార్టీ వైసిపి సిద్ధం( Siddham ) పేరుతో వరుసగా సభలను నిర్వహిస్తూ , పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచే ప్రయత్నం చేయడంతో పాటు, జనాల్లో తమకు ఏ స్థాయిలో బలం ఉందో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.దీంతో చంద్రబాబు సైతం రా కదిలి రా పేరుతో సభలను నిర్వహిస్తున్నారు.
ఈరోజు, రేపు రా కదిలిరా( Ra Kadali Ra ) సభలను వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేశారు.ఈరోజు ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోనే తన నివాసం నుంచి హెలికాఫ్టర్ లో అనకాపల్లి జిల్లా కె .కోటపాడు కు చంద్రబాబు బయలుదేరి వెళ్తారు.ఉదయం 11:30 గంటలకు గుండు పాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభ ప్రాంగణం కు చేరుకుని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు .ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు హెలికాఫ్టర్ లో ఏలూరు జిల్లా చింతలపూడి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
మంగళవారం మధ్యాహ్నం 2.50 గంటలకు చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారు.గంగాధర నెల్లూరు మండలం రామానాయుడు పల్లి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.ఆ తరువాత తిరుపతి విమానాశ్రయం నుంచి గన్నవరం చేరుకుని రోడ్డు మార్గంలో ఉండవల్లి( Undavalli )లోని తన నివాసానికి వెళ్ళనున్నారు.
ఇలా వరుసగా రా కదలిరా సభలను నిర్వహించడం ద్వారా, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచడంతోపాటు , వారిని ఎన్నికలకు సమయత్వం చేసేందుకు దోహదం చేస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.
ఇక ఈ సభలతో పాటు , జనసేన( Jana Sena ) పార్టీతోను ఉమ్మడిగా భారీ బహిరంగ సభలను నిర్వహించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.అధికార పార్టీ వైసిపి దూకుడుకు బ్రేకులు వేసే విధంగా వరుసగా సభలను నిర్వహించడం ద్వారా, పార్టీ శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ ఉత్సాహం పెంచేందుకు దోహదం చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలను మరింతగా మెరుగుపరుస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు.అందుకే ఎన్నికల తంతు ముగిసే వరకు నిత్యం పర్యటనలతోనే బిజీగా ఉండాలని నిర్ణయించుకున్నారు.