చిరంజీవి( Chiranjeevi ) ప్రజారాజ్యం పార్టీ అనౌన్స్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక తీవ్ర స్థాయి కుదుపుకు లోనయ్యాయి .ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి లభించని బారి అరంగేట్రం , ఆ స్థాయి హైప్ ఇంకెవరికీ దక్కలేదంటే అతిశయోక్తి కాదు.
సినిమా రంగంలో శిఖరం అంత ఎత్తు ఇమేజ్ కలికిన చిరంజీవి రాజకీయరంగ ప్రవేశం తో దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి కీలక నేతలు ఈ పార్టీలోకి క్యూ కట్టారు .ఒకరకంగా ఉధృతలా కొట్టుకొచ్చిన నాయకుల ప్రవాహాన్ని తట్టుకోవటం చిరంజీవికి సాధ్యం కాలేదనే చెప్పాలి .వచ్చిన నేతల్లో తన మంచి కోరే వారెవరు? వెనక గోతులు తీసే వారెవరు? అసలు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారెవరు? అనుకూలరు ఎవరు అన్న నిజాలు తెలుసుకునే లోపే ఎన్నికలకు దగ్గరకు వచ్చి పడటం మరోవైపు ఇంట్లో సమస్యలతో పాటు ప్రతిపక్షాల నుంచి విపరీతమైన విమర్శలు దాడులు మీడియా దాడులతో ప్రజారాజ్యం ఆరంభంలోనే అనేక ఆటుపోట్లు కి గురి అయ్యింది .

దాంతో విపరీత ప్రజాదరణ ఉన్నప్పటికీ దానిని ఓటింగ్ రూపంలో మార్చుకోవడంలో ప్రజారాజ్యం( prajarajyam ) విఫలమైంది.కేవలం 18 సీట్లతోనే సరిపెట్టుకుంది.అయితే ఆయన ఈ సీట్లను నిలబెట్టుకొని మరొక్క ఎన్నికను ఎదుర్కోగలిగితే ఈరోజు రాజకీయాల్లో ఉన్న చాలా మంది నాయకులు రాజకీయ తెర నుండి కనుమరుగైపోయేవారు.
అయితే విదివశాత్తు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో కలిసిపోవడంతో రాజకీయ సమీకరణాలు చిరంజీవికి వ్యతిరేకంగా మారిపోయాయి.తనను నమ్ముకుని వచ్చిన వారిని నట్టేట ముంచేసారంటూ అనేక అపవాదులు ఎదుర్కోవాల్సి వచ్చింది నిజానికి ఆ ప్రభావంతోనే జనసేనకు ఆరంభంలో ఆదరణ దక్కలేదని చెప్పవచ్చు .

అయితే తన పట్టుదలతో క్రమంగా పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చిన పవన్ జనసేన( Pawan ,Janasena ) ని ఈరోజు ప్రజాక్షేత్రంలో పోటీకి నిలబెట్టగలిగారు.తాను వెనకడుగు వేసే వాడిని కాదని రెండు సీట్లలో ఓడిపోయినా కూడా ప్రజలకి అవసరమైన ప్రతి చోటా ప్రత్యక్షమవుతూ తాను పీడిత ప్రజల పక్షాన నిలబడడానికే పార్టీ పెట్టానని గట్టిగా నిలబడడంతో ఇప్పుడు ఈరోజు జనసేన రేసులోకి వచ్చింది .అయితే ఇప్పుడు మెగా మద్దతు జనసేనకు దక్కబోతుండడంతో ప్రజారాజ్యం తాలూకు వైఫల్యాలు జనసేన ను వెంటాడుతాయా అన్న అనుమానాలు జనసేన హార్డ్ కోర్ అభిమానుల్లో కనిపిస్తున్నాయి.అయితే చిరు మద్దతు జనసేనకు బలమే కానీ బలహీనత కాదని, చిరు రాకతో పార్టీ కి నిండుతనం వచ్చి కీలక నాయకులు ఆకర్శించ బడతారు అని కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి అయితే ఒక్క సారి మెగా ఎంట్రీ పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ అయితే కానీ వాస్తవం ఏమిటో అర్దం కాదు
.