చిరంజీవి - బాలకృష్ణ .. ఎవరి పంతం వారిదే     2016-12-23   23:54:31  IST  Raghu V

చిరంజీవి విడుదల తేది ప్రకటించే దాకా మేము ప్రకటించం .. ఇది బాలకృష్ణ వరస. బాలకృష్ణ విడుదల తేది ప్రకటించే దాకా సైలెంట్ గానే ఉందాం … ఇది చిరంజీవి పంతం. ఇద్దరు ఇద్దరే. ఈ పంతం ఇలా ఉండటానికి కారణం, వీరిద్దరి బాక్సాఫీస్ పోటిల్లో ఉండే వేడి అలాంటిది.

ఇద్దరికి ఓపెనింగ్స్ కావాలి. అంటే ఇద్దరికి తొలిరోజు ఎలాంటి పోటి వద్దు. అందుకే ఇద్దరు తమ చిత్రాల విడుదల తేదిలు ప్రకటించట్లేదు. ఖైదీ నం.150, గౌతమీపుత్ర శాతకర్ణి, రెండూ వచ్చేది సంక్రాంతి సీజన్ లో అని మాత్రమే తెలుసు. ఏ చిత్రం ఏ రోజు విడదల అయ్యేది ఇంకా యూనిట్ సభ్యులకి కూడా సరిగా తెలియదు. ఎందుకంటే నిర్ణయం అవతలి క్యాంప్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది కాబట్టి.

ఈ నెలాఖరు లేదా, వచ్చే నెల మొదటివారంలో ఎలాగో విడుదల తేదిలు ప్రకటించాల్సిందే కాబట్టి, ఈ సస్పెస్స్ మరీ ఎక్కువ కాలం ఉండదు లేండి.