మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )ఇటీవలే భోళా శంకర్ సినిమా( Bhola shankar Movie ) షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసిన విషయం తెలిసిందే.మెహర్ రమేష్ దర్శకత్వం లో రూపొందుతున్న ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవ్వడం తో ఫ్యామిలీ తో కలిసి చిరంజీవి విదేశీ యాత్ర కు వెళ్లారు.
చిరంజీవి విదేశాల నుండి వచ్చిన వెంటనే బ్రో డాడీ సినిమా రీమేక్ పనుల్లో బిజీ అవ్వబోతున్నాడు.
సోగ్గాడే చిన్ని నాయన చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో ఈ రీమేక్ చేయబోతున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి సన్నిహితుల ద్వారా ఇప్పటికే సమాచారం అందుతుంది.ఈ రీమేక్ ని చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత భారీ బడ్జెట్ తో నిర్మించబోతుందనే విషయం కూడా అందరికీ తెలిసిందే.ఇక ఈ రీమేక్ లో చిరంజీవి తో పాటు యంగ్ స్టార్ హీరో సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) నటించబోతున్నాడు.
డీజే టిల్లు సినిమా తర్వాత సిద్దు జొన్నలగడ్డ స్థాయి అమాంతం పెరిగింది.అందుకే చిరంజీవి తో నటించే అవకాశాన్ని ఈ యంగ్ హీరో దక్కించుకున్నాడు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా లో హీరోయిన్స్ గా త్రిష ( Trisha )మరియు శ్రీ లీల కనిపించబోతున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జులై చివర్లో లేదా ఆగస్టులో ప్రారంభం కాబోతున్నాయి.ఆగస్టులో భోళా శంకర్ సినిమా విడుదలైన తర్వాత బ్రో డాడీ సినిమా పనులు వేగవంతం అవ్వబోతున్నాయి.వచ్చే సంవత్సరం సంక్రాంతి కి ఈ రీమేక్ తో మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశ పడుతున్నట్లుగా తెలుస్తోంది.2023 సంక్రాంతి కి వాల్తేరు వీరయ్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి 2024 సినిమా వచ్చే అవకాశాలున్నాయి.