జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.పవన్ కల్యాణ్ పద్ధతి మార్చుకోవాలన్నారు.
పవన్ తీరు మారకుంటే ప్రజలే చెప్పు చూపిస్తారని తెలిపారు.అదేవిధంగా పవన్ చెప్పే కాకి లెక్కలను ప్రజలు నమ్మరని చెప్పారు.
ప్యాకేజీ ఇచ్చే చంద్రబాబుకు తప్ప పవన్ ఎవరికీ గౌరవం ఇవ్వరని మండిపడ్డారు.ఎన్సీపీ, ఎన్సీఆర్బీకి తేడా తెలియని వ్యక్తి పవన్ అంటూ విమర్శించారు.
సిద్ధాంతాలు లేని వ్యక్తి పవన్ అన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయన ఎందుకు ఎమ్మెల్యే కూడా కాలేకపోయారని ప్రశ్నించారు.