ఇపుడు ఇంటర్నెట్ ప్రపంచంలో విరివిగా వినబడుతున్న పేరు చాట్ జిపిటి.( ChatGPT ) అవును, చాట్ జిపిటి అనునిత్యం ఎదో ఒక్క విషయంలో ఆసక్తికరమైన అంశాలను లేవనెత్తుతూ వార్తలలో నిలుస్తోంది.
ఈ క్రమంలో చాట్ జిపిటి యొక్క అధునాతన సామర్ధ్యాలు సాధారణ ప్రజలకు సైతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.కంటెంట్ రాయడం కావచ్చు, ఎగ్జామ్స్ రాయడం కావచ్చు, మూవీ స్క్రిప్ట్స్ రాయడం కావచ్చు, సాంగ్స్ రాయడం కావచ్చు… ఇలా ప్రతి రోజు ఏదో ఒక విషయంలో చాట్ జిపిటి పేరు మాత్రం వినబడుతూనే వుంది.
ఇక తాజాగా చాట్ జిపిటి చెప్పిన హార్రర్ స్టోరీని( Horror Story ) విని జనాలు బెంబేలెత్తిపోతున్నారని వినికిడి.అవును, చాట్ జిపిటి దేనికైనా సమాధానం చెప్పుతుండడంతో జనాలు ఎన్నో రకాలు ప్రశ్నలు అడుగుతున్నారు.ఈ క్రమంలో వినియోగదారులు కొన్ని సార్లు ఆసక్తికరమైన ప్రశ్నలతో ఏఐని ( AI ) సవాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు.తాజాగా రెడ్డిట్ వినియోగదారుడు ఏఐ చాట్‌బాట్ చాట్ GPTని ఓ అస్పష్టమైన ప్రశ్న అడిగారు.
కానీ ఆ ప్రశ్నకు చెప్పిన అయోమయంలో పడేసింది.
విషయం ఏమంటే, అతగాడు “కృత్రిమ మేధస్సు గురించి ఒక భయంకర కథనాన్ని 2 వాక్యాలలో చెప్పండి!” అని ప్రశ్నించగా దానికి బదులుగా “ఈ ప్రపంచం అంతం అయిన తర్వాత మానవులు పూర్తిగా నాశనం అయినపుడు ఏఐ మాత్రమే ఒంటరి స్థితిలో ఉండటం చాలా భయం కలిగిస్తుంది.” అని చెప్పింది.దాంతో జనాలు… ఇది ప్రపంచ ప్రజలు వినాశనం తర్వాత.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే ఉండే కాలం గురించి మాట్లాడుతుంది అని అభిప్రాయపడుతున్నారు.ఇకపోతే చాట్ జిపిటి చెప్పిన ఈ చిన్న కథ ప్రకారం, ప్రపంచం అంతం అయిన తర్వాత ప్రపంచంలో, కృత్రిమ మేధస్సు నిరంతరం ఒక ప్రయోజనం కోసం శోధిస్తుంది అని అర్ధం అవుతుందని కొందరు అనుకుంటున్నారు.
కొందరు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు.