టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ, పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.పాత తరహా రాజకీయాలు చేస్తే ప్రస్తుత తరుణంలో జగన్ ప్రభుత్వం పై చేయి సాధించలేమనే అంతిమ నిర్ణయానికి బాబు వచ్చినట్టు కనిపిస్తున్నారు.
అందుకే గత కొద్ది రోజులుగా పార్టీని ప్రక్షాళన చేసే విషయంపై ఆయన పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ శ్రేణులు కూడా ఆశ్చర్య పోయే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం చెందడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే పార్టీ సీనియర్ నాయకులు చాలామంది టీడీపీ లో ఉన్న, వారు ఎవరు యాక్టివ్ గా లేకపోవడం, పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా తమ వంతు ప్రయత్నాలు చేయకపోవడం ఇలా ఎన్నో అంశాలపై సీరియస్ గానే దృష్టి సారించారు.
ఇప్పటి నుంచే పార్టీ ని పరుగులు పెట్టించే విషయంలో సీరియస్ గా దృష్టి పెట్టకపోతే 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పొందాల్సి వస్తుందని, అదే కనుక జరిగితే టీడీపీ ఇక పూర్తిగా మనుగడ కోల్పోతుందనే ఆందోళన చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తోంది.అందుకే వైసీపీని ఇరుకున పెట్టే విధంగా పార్టీ సీనియర్ నాయకులు ప్రభావాన్ని పూర్తిగా తగ్గించి, యువ నాయకులకు ఎక్కువగా ప్రోత్సాహం అందించాలని నిర్ణయించుకున్నారట.
అదీ కాకుండా పార్టీలోనే ఉంటూ వైసీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్న నాయకుల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారట.అనుమానం ఉన్న నాయకులు అందరికీ ప్రాధాన్యం బాగా తగ్గించి పార్టీ నుంచి సాగనంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.దీంతో పాటు యువ నాయకులతో కొత్త టీమ్ లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.యువ నాయకులు అయితేనే ప్రస్తుత రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించ గలరని బాబు బలంగా నమ్ముతుండడం తోనే తెలుగుదేశం పార్టీలో భారీ మార్పులు చేర్పులు కనిపించే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.