సోఫాలో భ‌యంక‌ర‌మైన శ‌బ్ధాలు.. ఏంటో చూస్తే

ప్ర‌మాదం ఎక్క‌డ పొంచి ఉంటుందో చెప్ప‌డం ఎవ‌రి త‌రం కాదు.మ‌న టైమ్ బాగాలేక‌పోతే ఎక్క‌డైనా ఏదైనా ఉండొచ్చు.

 Horrible Noises On The Sofa In America What Is The Reason Details, Snake, Viral-TeluguStop.com

ఈ న‌డుమ పాములు ఇండ్ల‌లోనే కాదండోయ్ బీరువాల్లో, కారుల్లో ఆఖ‌ర‌కు బైకుల్లో కూడా దూరుతున్నాయి.ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా వైర‌ల్ అవుతూనే ఉన్నాయి.

అయితే ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒక‌టి నెట్టింట్లో బాగా వైర‌ల్ అవుతోంది.దాన్ని చూసిన త‌ర్వాత ఇలా కూడా పాములు చేస్తున్నాయా అని షాక్ అయిపోవ‌డం ఖాయం.

ఇంత‌కీ ఏం జ‌రిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది పాములు అన‌గానే అవేవో చెత్త పొద‌ల్లోనే లేక ఇంకేదైనా చోట దాక్కుంటాయ‌ని అనుకుంటున్నారు.

కానీ అవి కూడా ఇప్పుడు రూటు మార్చాయండోయ్‌.ఏకంగా ఇండ్ల‌ల్లోకి అలాగే మ‌నం రెగ్యుల‌ర్ గా వాడుకునే వ‌స్తువుల మీద‌కు వ‌స్తున్నాయి.

ఎక్క‌డ ప‌డితే అక్క‌డ క‌నిపించేస్తున్నాయి.ఇప్పుడు కూడా ఓ వ్య‌క్తి కూర్చున్న సోఫాలో దూరేసింది ఓ పాము.

అదేంటి సోఫాలో ఎలా దూరింది అని షాక్ అవ్వ‌కండి.ఇప్పుడు పాములు ప్ర‌కృతిలో కంటే కూడా మ‌నుషులు వాడుకునే వ‌స్తువుల్లోనే సేఫ్టీని వెతుక్కుంటున్నాయి.

అమెరికా కు చెందిన ఓ వ్య‌క్తి త‌న ఇంటి ముందు సోఫాలో కూర్చున్నాడు.అయితే అందులోంచి భ‌యంక‌ర‌మైన శ‌బ్ధాలు రావ‌డంతో భ‌య‌ప‌డిపోయి వెంట‌నే ఏంటా అని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే అది పాము అని తేలిపోయింది.వెంట‌నే అత‌ను క్లియర్‌వాటర్ పోలీసులకు స‌మాచారం అందించాడు.ఇక వారు వ‌చ్చి స్నేక్ రెస్క్యూ టీమ్‌తో ఆ పామును చాలాసేపు ప్ర‌య‌త్నించి చివ‌ర‌కు ప‌ట్టేసుకున్నారు.అది సోషాకు క‌న్నం ఉండ‌టంతో దూరింద‌ని అంచ‌నాకు వ‌చ్చేశారు.ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రి మీరు కూడా చూసి మీ కామెంట్ ఏంటో తెలియ జేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube