టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ “యువగళం” పాదయాత్ర ఈరోజు ఉదయం కుప్పంలో స్టార్ట్ కావడం తెలిసిందే.మొదటిరోజు పాదయాత్రలో నారా లోకేష్ తో పాటు హీరో నందమూరి తారకరత్న పాల్గొనడం జరిగింది.
ఈ క్రమంలో ఒక్కసారిగా తోపులాట జరగటంతో ఆయన ఉదయం అస్వస్థతకు గురికావడం తెలిసిందే.అయితే ఆయన గుండెపోటుకు గురైనట్లు వైద్యులు తెలియజేశారు.
ప్రస్తుతం కుప్పంలో పీఈఎస్ ఆసుపత్రిలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు.
అయితే ఆయన ఆరోగ్య పరిస్తితి ఆందోళనకరంగా ఉన్న నేపధ్యంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఏర్పాట్లు చేశారు.ఇదే సమయంలో నారాయణ హృదయాలయ ఆసుపత్రి డాక్టర్స్ కీ… కుప్పం ప్రవేట్ ఆసుపత్రీ వైద్యులు అన్ని వివరాలు తెలియజేయడం జరిగింది.
ఇక ఇదే సమయంలో ఎయిర్ అంబులెన్స్ ద్వారా బెంగళూరుకు తారకరత్ననీ తరలించడానికి చంద్రబాబు ప్రయత్నాలు స్టార్ట్ చేయడం జరిగిందంట.
దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైతో కూడా ఫోన్ లో సంభాషించారట.ఈ క్రమంలో నగరంలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని.విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
ఏది ఏమైనా తారకరత్నకి మెరుగైన వైద్యం అందించాలని బెంగళూరు తరలింపునకు చంద్రబాబు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందట.తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.