సగ్గుబియ్యమును ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకుంటే శరీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో బాగా ఉంటుంది.సగ్గుబియ్యమును సాబుదానా అని కూడా అంటూ ఉంటారు.
సాబుదానా అనేది ఒక పిండి పదార్థం అని దాదాపు అందరికి తెలుసు.ఇందులో మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
సగ్గుబియ్యంతో ఎన్నో రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.సగ్గుబియ్యం లో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శరీర బరువు తక్కువగా ఉండి బలహీనంగా ఉన్నవారు తరుచూ సగ్గుబియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే ఇందులో సమృద్ధిగా ఉన్న కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి.రోజంతా ఇవి మిమ్మల్ని ఉషారుగా ఉండేలా చేస్తాయి.
అంతేకాకుండా శరీరం దృఢంగా ఉండేలా చేస్తుంది.సగ్గుబియ్యంలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుంది.
కాబట్టి చక్కర వ్యాధిగ్రస్తులు దీనిని ఎటువంటి భయం లేకుండా తినవచ్చు.అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు సగ్గుబియ్యాన్ని ఎలాంటి సమస్య లేకుండా తినవచ్చు.
ఇందులో ఉన్న పొటాషియం రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్త పోటును నియంత్రణలో ఉంచుతుంది.తరచూ జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు సగ్గుబియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలను కూడా దూరం చేసే అవకాశం ఉంది.సగ్గుబియ్యం లో అత్యధికంగా ఉండే ఐరన్ మన శరీరానికి లభిస్తుంది.
సగ్గుబియ్యంతో చేసిన ఆహార పదార్థాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాలను దూరం చేస్తాయి.ఇందులో ఉండే మెగ్నీషియం ఖనిజాల వల్ల ఎముకలు ఎంతో దృఢంగా ఉంటాయి.అంతేకాకుండా నాడీ కణ వ్యవస్థను ఇది బలోపేతం చేసి మెదడు చురుకుగా ఉండేలా చేస్తుంది.