'నా పిల్లి మొరటుది' కాదంటూ కేసు.. కళ్లు తిరిగేంత పరిహారం!

అమెరికాలో పెంపుడు పిల్లి కోసం పోరాడిన దాని యజమాని ఎట్టకేలకు కేసులు విజయం సాధించి రూ.95 లక్షలు పొందనున్నాడు.వినడానికి ఇది వింతగా అనిపించినప్పటికీ.ఈ ఉదంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది.అమెరికాకు చెందిన అన్నా డానియెలీ అనే మహిళ పిల్లిని పెంచుకుంటోంది.ఆ పిల్లి పేరు మిస్కా.

 Cat Owner Fought For Pet Cat In Court Details, Pet Cat, Pet Cat Owner, Police Ca-TeluguStop.com

3 సంవత్సరాల క్రితం వివిధ సంఘటనల కారణంగా మిస్కాపై 30 కేసులు నమోదయ్యాయి.అలాగే దానిపై జరిమానాలు, నియమాల ఉల్లంఘన ఛార్జీలు విధించారు.

మొత్తం మీద పిల్లి దురుసుగా ప్రవర్తించిందనే ఫిర్యాదుతో దాని యజమానికి 23 లక్షల జరిమానా విధించారు.అన్నా పెంపుడు పిల్లిని యానిమల్ కంట్రోల్ ఆఫీస్ యాజమాన్యం స్వాధీనం చేసుకుంది.

ఈ కేసు 2019 నాటిది.అన్నా డానియెలీ న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం.జంతు నియంత్రణ కార్యాలయానికి చెందిన పలువురు అధికారులు అన్నా ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్నారు.వారు పిల్లి ప్రవర్తన తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మిస్కా ఈ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఇతర జంతువులను చంపేస్తోందని వారు ఫిర్యాదు చేశారు.మిర్రర్ నివేదిక ప్రకారం అన్నా తన పిల్లిపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ ఈ విషయాన్ని కోర్టుకు తీసుకెళ్లడం సరైనదని భావించింది.

Telugu Rupees, America, Anna Daniole, Miska Cat, Pet Cat, Cat, Washington-Latest

న్యాయవాది సహాయంతో ఆమె కేసు దాఖలు చేసింది.ఈ కేసు 3 మూడేళ్ల పాటు నడిచింది.ఇటీవలే ఈ కేసులో తీర్పును వెలువడింది.ఆ పెంపుడు పిల్లి ఆ ప్రాంతంలో ఎలాంటి సమస్య సృష్టించలేదని కోర్టు నిర్థారించింది.పిల్లి నిర్దోషిగా పరిగణించిన కోర్టు అన్నాకు £ 1,00,000 అంటే భారతీయ కరెన్సీలో మొత్తం 95 లక్షల రూపాయల పరిహారం అందజేయాలని తీర్మానించింది.ఇది చారిత్రాత్మక నిర్ణయమని, వాషింగ్టన్‌లో పెంపుడు పిల్లి హక్కులను తొలిసారిగా పరిరక్షించామని అన్నా తరఫు న్యాయవాది తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube