బాబోయ్‌ : హైదరాబాద్‌కు వచ్చేసిన కరోనా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మెల్లగా చైనా నుండి ప్రపంచం మొత్తం ప్రాకుతుంది.ఇప్పటికే చైనాలో కొన్ని వేల మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు.

 Carona Virus Reached In Hyderabad-TeluguStop.com

వందల మంది చనిపోయారు.వేల మంది చావు అంచున కొట్టుమిట్టాడుతున్నారు.

ఇప్పటికే ఇండియాలో కేరళలో కరోనా వైరస్‌ లక్షణాలు రోగుల్లో బయట పడ్డ విషయం తెలిసిందే.తాజాగా హైదరాబాద్‌లో కూడా కరోనా వైరస్‌ బాధితులను గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతుంది.

తాజాగా హైదరాబాద్‌ గాంధీ హాస్పిటల్‌లో నలుగురికి కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్‌ లక్షణాలున్న వారికి ప్రత్యేక చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసింది.

ఇప్పుడు వారిని అక్కడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రస్తుతానికి వారికి ఉన్నది కరోనా లేదంటే మరేమైనానా అనేది తెలియలేదు.

కాని డాక్టర్లు మాత్రం ఎక్కువ శాతం అదే అయ్యి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వారి వద్దకు వెళ్లేదుకు కూడా డాక్టర్లు మరియు ఇతర స్టాఫ్‌ భయపడుతున్నారు.

రేపటి వరకు వారికి పూర్తి పరీక్షలు చేసి ఒకవేళ కరోనా అయితే ప్రత్యేక వార్డులోకి షిప్ట్‌ చేసి ట్రీట్‌మెంట్‌ అందించబోతున్నట్లుగా డాక్టర్లు వెళ్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube