భారత్ నుంచీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలకు భారతీయులు వలసలు వెళ్లి అక్కడే స్థిరపడుతున్నారు ఇలా ఏటా లక్షలాది మంది ఇతర దేశాలకు వెళ్తున్నట్టు అంచనా.భారత్ నుంచీ వలసలు వెళ్ళే వారిలో అత్యధికంగా అమెరికా వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
ఆ తరువాత భారతీయులను తమదేశం లోకి ఆకర్షించే క్రమంలో బ్రిటన్, కెనడా వంటి దేశాలు అమెరికాతో పోటీ పడుతున్నాయి.ఈ క్రమంలోనే ఆయా దేశాలు అందించే వీసా సేవలపై మరిన్ని వెసులుబాటులు కల్పిస్తున్నాయి.
తాజాగా.
కెనడా ప్రభుత్వం భారతీయులను ఆకర్షించే క్రమంలో ఇప్పటికే ఎన్నో ఆఫర్లు ప్రకటించగా తాజాగా ప్రవాసుల వీసా విషయంలో ఓ సంచలన ప్రకటన చేసింది.
కెనడాలో శాశ్వత వీసా కలిగిన ఎన్నారైల తల్లి తండ్రులకు ఇచ్చే సూపర్ వీసాల విషయంలో కీలక మార్పులు తీసుకువచ్చింది.పదేళ్ళ కాలపరిమితితో ఇచ్చే ఈ వీసాల సింగిల్ ఎంట్రీపై ఐదేళ్ళ వరకూ మినహాయింపు ఇస్తూ రెండేళ్ళ కు ఒకసారి రెన్యువల్ చేసుకునే విధంగా వెసులు బాటును కల్పించింది.
భారతీయ ప్రవాసులు వారి తల్లి తండ్రులకు దూరంగా ఉండకుండా వారిని కూడా తమతో శాశ్వతంగా ఉంచుకునేలా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది.
కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాగా ఈ మార్పులు జులై 4 వ తేదీ నుంచీ అమలులోకి రానున్నాయని తెలుస్తోంది.
ఇదిలాఉంటే కెనడా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అత్యధికంగా లాభపడేది భారతీయులేనని తెలుస్తోంది.ఎందుకంటే కెనడా వ్యాప్తంగా ఉన్నట్టువంటి ప్రవాసులలో సుమారు 50 శాతం భారతీయులే ఉన్నారని అక్కడి గణాంకాలు చెప్తున్నాయి.2020 లో సుమారు 1.07 లక్షల వీసా దరఖాస్తులు రాగా అందులో 50 వేల మంది భారతీయులవేనని తెలుస్తోంది.ఇదిలాఉంటే కెనడాలో ఉన్న భారతీయులలో అత్యధిక శాతం మంది సిక్కు కమ్యూనిటీ కి చెందిన వారు ఉండటం గమనార్హం.