కెనడాకు చెందిన భారత సంతతి గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండా సంఘ వ్యవతిరేక కార్యకలాపాలు అతని తల్లిదండ్రుల జీవితాలను దుర్భరంగా మార్చాయి.తరన్ తారన్ జిల్లా హరికేలో నివాసముంటున్న అతని తండ్రి నరంజన్ సింగ్ (75) మాజీ సైనికుడు .
తల్లి పర్మీందర్ కౌర్ (65)లు వృద్ధాప్యం కారణంగా వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు.వీరి కుటుంబానికి సొంత ఇల్లు, ట్రాక్టర్, విలాసవంతమైన కారు, 20 ఎకరాల భూమి వుంది.తన భర్త మధుమేహ వ్యాధిగ్రస్తుడని.ఎన్నోసార్లు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారని లాండా తల్లి పర్మీందర్ ఆవేదన వ్యక్తం చేశారు.తమ బంధువులు పోలీసులు వేధింపులకు భయపడి మా ఇంటికి రావడానికి భయపడుతున్నారని.చివరికి వైద్యులు కూడా తమ ఇంటికి వచ్చేందుకు నిరాకరిస్తున్నారని పర్మీందర్ తెలిపారు.
నేర కార్యకలాపాలలో అతని ప్రమేయంపై కలత చెంది.తల్లిదండ్రులు అతనిని తిరస్కరించారు.
లఖ్‌బీర్ కాలేజీ రోజుల నుంచి విద్యార్ధి రాజకీయాల కారణంగా గొడవలు పడేవాడట.
నరంజన్ సింగ్ దంపతులకు ఇద్దరు కుమారులు తార్సేమ్ సింగ్, లఖ్‌బీర్ సింగ్.తన సోదరుడి నేర చరిత్ర కారణంగా తార్సేమ్ గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయాడు.2017లో లఖ్‌బీర్ కెనడాకి వెళ్లినప్పుడు.తన తప్పులను సరిదిద్దుకుని, సాధారణ జీవితాన్ని గడుపుతాడని తల్లిదండ్రులు భావించారు.2019 వరకు లఖ్‌బీర్ ప్రశాంతమైన జీవితం గడిపాడు.కానీ కోవిడ్ 19 సమయంలో వ్యాపారాలు దెబ్బతినడంతో అతను మళ్లీ నేరాల బాటపట్టాడు.ఏడాది క్రితం స్థానిక యువకుల బృందం తమ ఇంటిపై కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేసిందని పర్మీందర్ చెప్పారు.
పోలీసుల ఒత్తిడి, దుండగుల బీభత్సం కారణంగా తన భర్త ఎప్పుడూ ఆందోళన చెందుతూనే వుంటారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపోతే.
కెనడాలో వున్న గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాపై హత్య, హత్యాయత్నం, కాల్పులు వంటి దాదాపు 20 క్రిమినల్ కేసులు వున్నాయి.ఈ స్థాయిలో కేసులు వున్నా.
అతను రెండేళ్ల క్రితం విదేశాలకు పారిపోయాడు.ఈ నేపథ్యంలో అతని అప్పగింత సహా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు.
అతనిపై అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ తరన్ తారన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.వ్యాపారులు, కాలనీవాసులు, డాక్టర్లను బెదిరించి ఇతను వసూళ్లకు పాల్పడేవాడని పోలీసులు చెబుతున్నారు.
గతేడాది మే 27న పట్టి వద్ద ఇద్దరు అకాలీదళ్ కార్యకర్తలను కాల్చిచంపిన కేసులోనూ అతను ప్రధాన సూత్రధారి.