వ్యాక్సిన్ వేసుకున్నాక మద్యం సేవించొచ్చా..? లేదా..?

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మందుబాబులకు ఒక చిన్న డౌట్ ఉంది.వ్యాక్సిన్ వేసుకున్నాక ఎన్నిరోజులకు మద్యం సేవిచవచ్చు.

 Can You Consume Alcohol After Vaccination, Alcohol , Corona, Vaccination-TeluguStop.com

అసలు వ్యాక్సిన్ వేసుకున్నా మద్యం తీసుకోవచ్చా లేదా.తీసుకుంటే ఏదైనా ప్రమాదం ఉందా ఇలాంటి డౌట్లన్ని ఉండటం సహజం.

అయితే టీకా తీసుకున్న వారు మద్యం తీసుకోకూడదు అన్న ప్రశ్నలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పందించాయి.కరోనా వ్యాక్సిన్ ప్రభావాన్ని ఆల్కహాల్ తగ్గిస్తుందని ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు.

మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ప్రకారం ఆల్కహాల్ వ్యాక్సిన్ సామర్ధ్యాన్ని తగ్గిస్తుందని ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు.అయితే మద్యం అధికంగా తీసుకోవడం వల్ల శ్రీరంలో మార్పులు వస్తాయని.

రోగనిరోధక శక్తి తగ్గుతుందని తెలిసిందే.దాని వల్ల వ్యాక్సిన్ ప్రభావం కొంతమేరకు తగ్గొచ్చని అభిప్రాయపడ్డారు.

ఒక వ్యక్తి పరిమితంగా మద్యం తాగితే వ్యాక్సిన్ ప్రభావం తగ్గదని.అయితే అదే పనిగా తాగితే మాత్రం వ్యాక్సిన్ ప్రభావం తగ్గి మళ్లీ వైరస్ బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు.

మద్యం సేవించకపోవడం వల్ల వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేయడంతో పాటుగా ఇలాంటి టైం లో దానికి దూరంగా ఉంటే శరీరానికి కూడా చాలా మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube