ఈ మధ్యకాలంలో కొందరు అవగాహన లేమి కారణంగా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఇతరుల జీవితాలను బుగ్గి పాలు చేస్తున్నారు.కాగా తాజాగా ఓ మహిళ పెళ్లైన తర్వాత తన భర్త తమ్ముడితో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరికి అతడినే పెళ్లి చేసుకున్న ఘటన “జార్ఖండ్” రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోనే లచ్కాన్ అనే గ్రామంలో “మల్లేష్ (పేరు మార్చాం)” అనే వ్యక్తి తన భార్య పిల్లలతో నివాసముంటున్నాడు.అయితే మల్లేష్ ఉద్యోగం నిమిత్తమై తరచూ ఎక్కువగా బయటకు వెళుతున్నాడు.
ఈ క్రమంలో మల్లేష్ భార్య తన మరిది అయిన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.దీంతో పని నిమిత్తమై మల్లేష్ బయటికి వెళ్లినప్పుడు తన పిల్లలను ఆడుకోవడానికి బయటకు పంపించి మరిదితో సరస సల్లాపాలు సాగించేది.
దీంతో ఈ మధ్య వీరిద్దరూ ప్రవర్తనపై మల్లేష్ కి అనుమానం కలగడంతో పాటు ఇతరులు కూడా వీరిద్దరి వ్యవహారం గురించి ఫిర్యాదు చేయడంతో తన భార్య మరియు తమ్ముడుపై నిఘా ఉంచారు.దీంతో మల్లేష్ తన భార్య వివాహేతర సంబంధం గురించి పలు విస్తుపోయే నిజాలను కనుగొన్నాడు.
దీంతో మల్లేష్ ఏకంగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.అయితే ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే తన భార్య తన తమ్ముడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని నిజం తెలుసుకున్న తర్వాత ఇద్దరినీ కూర్చోబెట్టి తమ అభిప్రాయాలను తెలుసుకున్నాడు.
ఈ క్రమంలో తన భార్య తన తమ్ముడితో కలిసి జీవించాలని అనుకుంటున్నట్లు తెలియడంతో ఇద్దరికీ పెళ్లి చేశాడు.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.