సోషల్ మీడియా (S ocial media )అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఎక్కడ జరిగిన వింత విడ్డూరాలు అయినా ఇట్టే మనకి తెలిసిపోతుంది.ఈ క్రమంలో కొన్ని వీడియోలు జనాదరణకు నోచుకుని మిలియన్ల వ్యూస్ దక్కించుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే అందులో కొన్ని నవ్వు తెప్పించేవిగా ఉంటే, మరికొన్ని భయాందోళనలకు గురిచేస్తాయి.కొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తే, మరి కొన్ని వీడియోలు చూసి మనం చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాం.
తాజాగా ఆ రకానికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాన్ని చూసిన జనాలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
సాధారణంగా వివాహ సమయంలో కొత్త పెళ్లికూతురు( Bbride ) అప్పగింతలు సమయంలో కాస్త ఎమోషనల్ అయ్యి, కన్నీళ్లు పెట్టుకోవడం సహజమే.ఈ క్రమంలోనే ఒక నవవధువు కన్నీళ్లు పెట్టుకోవడమే కాక, అత్తారింటికి నేను వెళ్ళను పొమ్మంటూ, గట్టిగా ఏడవడంతో సదరు తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచక కంగారుపడి చూస్తూ ఉండగా, ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది.నవవధువు సోదరుడు ఆ సమయంలో చొరవ తీసుకొని నవవధువుని అమాంతం చేతుల్లోకి ఎత్తుకొని మరి, కారులోకి ఎక్కించి కూర్చోబెట్టడం ఎక్కడి వీడియోలో చూడవచ్చు.
ఇదే సంఘటన అక్కడ ఉన్న వారికి ఆశ్చర్యాన్ని కలిగించగా, వీడియో చూసిన సోషల్ మీడియా జనాలు కేరింతలు కొడుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఆ కుర్రాడుపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
సాధారణంగా సోదరుడు అనేవాడు ఎక్కడైనా తన సోదరీమణుల పట్ల చాలా ప్రేమని కలిగి ఉంటాడు.మరి ఇక్కడ జరిగిన ఘటనలో సదరు కుర్రాడికి ప్రేమ ఎక్కువైందేమో మరి? తన సోదరి ఎప్పుడు అక్కడినుండి వెళ్ళిపోతుందని చూశాడేమో మరి? అలా ఆమెని కారులోకి ఎత్తుకెళ్లి మరి పడేశాడు….అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక అలా ఆమెని కారులోకి తీసుకెళ్లి కూర్చోపెట్టిన సరే, ఆమె ఏడుస్తూ ఉండడం సదరు వీడియోలో గమనించవచ్చు.అయితే ఇది చూసే వారికి ఎలా ఉన్నా, అక్కడ స్థానిక జనాలు మాత్రం ఆ ఫన్నీ సంఘటనని చూసి చాలా ఎంజాయ్ చేయడం అందులో గమనించవచ్చు.