సల్మాన్ ఖాన్ కి పఠాన్ రోజులు వచ్చేది ఎప్పుడు భయ్యా..!

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ( Shahrukh Khan )దాదాపు పది సంవత్సరాల తర్వాత కమర్షియల్ సక్సెస్ ని పఠాన్ చిత్రంతో సొంతం చేసుకున్నాడు.షారుక్ ఖాన్ అభిమానుల ఎదురు చూపులకు పఠాన్ చిత్రం సమాధానం ఇచ్చింది అనడంలో సందేహం లేదు.రూ.1000 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన పఠాన్ సినిమా తర్వాత షారుక్ ఖాన్ కెరియర్ పూర్తిగా టర్న్ అయినట్లుగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒకప్పుడు షారుఖ్‌ ఖాన్‌ తో సినిమాలు చేసేందుకు భయపడ్డారు, ఇప్పుడు వరుసగా నాలుగైదు సినిమాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.జవాన్ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Bollywood Star Hero Salman Khan News , Bollywood, Flim News, Salman Khan, Telugu-TeluguStop.com

ఇక షారుక్ ఖాన్ మాదిరిగానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్( Salman Khan ) కూడా సక్సెస్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు.కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమా కోసం సల్మాన్ ఖాన్ చేయని ప్రయత్నం లేదు.

ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమవుతున్నాయి.ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే భారీ పారితోష్కం తో భారీ రెమ్యూనరేషన్ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే.

Telugu Bollywood, Kisika, Salman Khan, Telugu, Top-Movie

అలాగే సల్మాన్ ఖాన్ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి, అయినా కూడా ఆయన సినిమాలను జనాలు పట్టించుకోవడం లేదు.ఇటీవల వచ్చిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ( Kisi ka bhai kisi ki jaan )సినిమా దారుణంగా విఫలమైంది.స్టార్ హీరో అనే అభిప్రాయం కూడా లేకుండా ప్రేక్షకులు దారుణమైన కలెక్షన్స్ కట్టబెట్టారు.సల్మాన్ ఖాన్ అభిమానుల తో పాటు బాలీవుడ్ ప్రముఖులు అంతా కూడా ఎప్పుడెప్పుడు సల్మాన్ ఖాన్ కి పఠాన్ వంటి భారీ విజయం సొంతం అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు.

షారుఖ్ ఖాన్‌ పఠాన్ సినిమా తర్వాత ఎంతటి క్రేజ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సల్మాన్ ఖాన్ కి కూడా పఠాన్ వంటి ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ పడితే అంతే స్థాయిలో క్రేజ్‌ పెరిగి బిజీ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube