Saif Ali Khan : తెలుగు లో విలన్లుగా స్థిరపడిపోతున్న బాలీవుడ్ హీరోలు

టాలీవుడ్ లో మన దర్శకులు రకరకాల సెంటిమెంట్స్ ని వారి సినిమాల కోసం ప్రయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా హీరోకు దీటుగా ఒక విలన్ ఉంటే తప్ప విజయం సాధించలేదు అని గట్టిగా నమ్ముతారు.రాజమౌళి సినిమాలే తీసుకోండి హీరో కన్నా కూడా విలన్ బలవంతుడై ఉండాలి.

 Saif Ali Khan : తెలుగు లో విలన్లుగా స్థ-TeluguStop.com

అలాగే ప్రస్తుతమున్న దర్శకులంతా కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు.అందుకే బాలీవుడ్ నుంచి నిన్న మొన్నటి వరకు హీరోలుగా చేసిన వారిని విలన్ లుగా ఇంపోర్ట్ చేస్తున్నారు.

మన తెలుగు వారికి విలన్లు అయ్యే అదృష్టం లేదా లేదంటే బాలీవుడ్ వారు అంత అదృష్టవంతులో తెలియదు కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో సందడి చేస్తున్న ఆ బాలీవుడ్ హీరో కం విలన్స్ ఎవరో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Adipurush, Animal, Arjun Rampal, Bobby Deol, Bollywood, Bollywood Heros,

బాలయ్య బాబు మరియు శ్రిలీల నటించిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari Movie ) ద్వారా ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి బాలీవుడ్ హీరో అయినా అర్జున్ రాం పాల్( Arjun Rampal ) ని విలన్ గా దింపాడు.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో బాగా క్రేజ్ వచ్చింది.అందుకే అర్జున్ ఇక్కడ మరిన్ని సినిమాలో నటించేందుకు కథలు కూడా వింటున్నాడు.

ఇదే వరస నా కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర ఈ సినిమా కోసం బాలీవుడ్ లో ఎన్నో సినిమాలతో క్యూట్ లవర్ బాయ్ గా హల్చల్ చేసిన సైఫ్ అలీ కాని విలన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు.ఇప్పటికే ఆది పురుష్ సినిమా ద్వారా సైఫ్ తెలుగు వారికి కొంతమేర పరిచయమైన, అది హిందీ సినిమా గానే అందరూ భావిస్తున్నారు.

దాంతో సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan )ఇక్కడ క్రేజ్ సంపాదించుకుంటాడని మరిన్ని చిత్రాల్లో కనిపించబోతాడని అందరూ ఆశిస్తున్నారు.

Telugu Adipurush, Animal, Arjun Rampal, Bobby Deol, Bollywood, Bollywood Heros,

ఇక ఇప్పుడు తాజాగా ఆనిమల్ సినిమా( Animal Movie )కూడా విడుదల సంగతి మన అందరికీ తెలిసిందే .ఈ చిత్రంలో విలన్ గా బాబి డియోల్ నటించాడు.తెరపై బాబీ కనిపించిన సమయం తక్కువే అయినప్పటికీ ఎక్స్ప్రెషన్ తో అందరిని మెస్మరైజ్ చేశాడు.

ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో కూడా బాబీ కనిపించబోతున్నట్టు సమాచారం అందుతుంది.ఇది కాకుండా తెలుగులో ఒకటి రెండు సినిమాలు ఇప్పటికే ఒప్పుకున్నాడట.

దీంతో బాలీవుడ్ నుంచి వచ్చిన మరొక హీరో ఇక్కడ విలన్ గా స్థిరపడిపోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube