వైరల్..మనుషుల్లోనే కాదు..ఏనుగుల్లో కూడా దాగి ఉన్న మానవత్వం !

మనుషుల్లో మానవత్వం పోతున్న ఈ రోజుల్లో ఇప్పటికి కొంతమందిని చూస్తే ఇంకా మానవత్వం ఉందని అనిపిస్తుంది.ఈ రోజుల్లో పక్క వాళ్లకు కష్టం వచ్చిందంటే మనకు ఎందుకులే అని అనుకుంటాం.

 Blind Elephant Gets Help From Friend Who Guides Her Towards Food, Elephants Help-TeluguStop.com

కానీ వాళ్ళ కష్టాలకు చలించి కొంతమంది వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తారు.అయితే కొన్ని కొన్ని సార్లు జంతువుల్లో కూడా మానవత్వం ఉందని అవి నిరూపిస్తూ ఉంటాయి.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయినా ఒక వీడియో చూస్తే మానవత్వం అనే పదం గుర్తుకు వస్తుంది.జంతువుల్లో విశ్వాసం అనగానే ముందుగా మనకు కుక్క మాత్రమే గుర్తుకు వస్తుంది.

కానీ కుక్క మాత్రమే కాదు మిగతా జంతువుల్లో కూడా మానవత్వం ఉందని ఈ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది.ఈ వీడియోలో ఒక ఏనుగుకు మరొక ఏనుగు సహాయం చేస్తుంది.

ఏనుగులు ఎక్కువుగా గుంపులుగా జీవించడానికే ఇష్ట పడతాయి.ఒకదానికి కష్టం వస్తే ఇంకొకటి ముందుకు వస్తాయి.

అలానే ఈ ఏనుగుల గుంపులో ఒక ఏనుగుకి కంటి చూపు లేదు.కంటి చూపు లేని ఆ ఏనుగుకు తన స్నేహితుడు అయినా మరొక ఏనుగు సహాయం చేసింది.

ఈ వీడియోను లెక్ ఛాయిలెర్ట్ అనే వ్యక్తి సోషల్ మీడియాలోని తన ఖాతాలో పోస్ట్ చేసాడు.

Telugu Blind Elephant, Blindelephant, Elephant, Blind-Latest News - Telugu

ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దీ గంటల్లోనే వైరల్ అయ్యింది.ఈ వీడియోలో ఉన్న మూడు ఏనుగుల్లో ఒక ఏనుగుకు కంటి చూపు లేదు.అందుకే మరొక ఏనుగు కంటి చూపు లేని ఆ ఏనుగుకు ఆహారాన్ని వెతుక్కోవడానికి సహాయం చేసింది.

ఆహారం దగ్గరకు ఆ ఏనుగును తీసుకు వెళ్లి వదిలేసింది.ఈ వీడియో చుసిన నెటిజెన్స్ మనుషుల్లో కూడా మరిచి పోతున్న మానవత్వం జంతువుల్లో స్పష్టంగా కనిపిస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

ఆ వీడియోను మీరు కూడా ఒక లుక్ వేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube