వచ్చే అసెంబ్లీ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) తన రాజకీయ వ్యూహాలకు మరింతగా పదును పెడుతున్నారు.వచ్చే ఎన్నికల్లో గెలుపునకు ఏ డోకా లేకుండా చేసుకునేందుకు అన్ని రకాల అవకాశాలను వినియోగించుకునే పనిలో పడ్డారు.
ప్రజల్లో ఏ ఏ విషయాల్లో అసంతృప్తి ఉంది ?ఏ విధంగా ప్రభుత్వం నుంచి సాయం కోరుకుంటున్నారు అనే విషయాల పైన ఆరా తీస్తున్నారు.ప్రజల్లో బీఆర్ఎస్ కు మరింతగా ఆదరణ పెరగాలంటే కచ్చితంగా ప్రజాకర్షణ పథకాలను మరిన్ని ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
అంతేకాకుండా గత నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం లభించే దిశగా కెసిఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
దీనికోసం 19 వేల కోట్లను బిఆర్ఎస్ ప్రభుత్వం( BRS ) కేటాయించింది.
నెలన్నర రోజుల్లోగా ఈ మొత్తాన్ని జమ చేయాలంటే దీనికి తగ్గట్టుగా నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది.ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పై భారం ఎక్కువగా ఉన్నా, ఎన్నికల్లో ఇదే విషయాలను విపక్ష పార్టీలు అస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్ ను ఇరుకునుపెట్టి , ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తాయని అంచనా వేస్తున్న కేసీఆర్ , విపక్షాలకు ఎక్కడా అవకాశం దొరక్కుండా చేయాలని నిర్ణయించుకున్నారు.
అందుకే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు .గత ఎన్నికల సమయంలో రుణమాఫీ మొత్తాన్ని రైతులకు చెల్లించాలని నిర్ణయించుకున్నారు.అలాగే గత ఎన్నికల్లో లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.అప్పట్లో హామీ ఇచ్చినా కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గడం ,ఇతర ఖర్చులు పెరిగిపోవడంతో ఈ అంశాన్ని పక్కన పెట్టింది.

దీని పైన తాజాగా నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు 18,241 కోట్ల బడ్జెట్ విడుదలకు ఉత్తర్వులు ఇచ్చారు.37 వేల నుంచి 41 వేల లోపు రుణమున్న 62, 758 మంది రైతుల ఖాతాల్లో రూ.237.85 కోట్లను జమ చేసింది.రైతులకు రుణమాఫీ చేయడం ద్వారా ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కనిపిస్తుందని కెసిఆర్ నమ్ముతున్నారు .అలాగే రుణమాఫీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తోంది.ఇక ఇటీవలే ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్ ను కలిశారు.
పిఆర్సి పై కమిషన్ ఏర్పాటు చేయడం, మభ్యంతర భృతి ని త్వరలోనే ప్రకటించడం వంటి అంశాలను చర్చించారు.వీటిపైన కేసీఆర్ సానుకూలంగానే స్పందించినట్లుగా ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.
ఇక దివ్యాంగులకు పెన్షన్లను 3,016 నుంచి 4,016 కు పెంచింది.ఆసరా పెన్షన్లు నెలకు 2,016 వంతున ఇస్తున్నారు.
వీటిని కూడా పెంచే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు.ఇక నిరుద్యోగ భృతి అంశం పెండింగ్ లో ఉన్నా, దానిపైనా ఎన్నికల సమయంలోపు కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనతో కేసిఆర్ ఉన్నారు.

అలాగే ఆర్టీసీ కార్మికులను( RTC workers ) ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, వీఆర్ఏ వ్యవస్థను( VRA system ) రద్దుచేసి దానిలోని 24 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవడం వంటివి సానుకూల ప్రభావాన్ని చూపుతుంది అని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు.ఇక ఎక్కడికక్కడ పార్టీ నేతల మధ్య నెలకొన్న గ్రూపు రాజకీయాలను పరిష్కరించి, వచ్చే ఎన్నికల్లో అంతా యాక్టివ్ గా పార్టీ విజయానికి కృషి చేసే విధంగా కృషి చేయబోతున్నారు.దీంతో ఏ అంశం పైన విపక్షాలకు పోరాటం చేసే అవకాశం లేకుండా చేసి మూడోసారి విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో కెసిఆర్ ఉన్నారు.