బీజేపీ మాట : ఓడిపోతామని తెలిసినా ... యూటర్న్స్ తీసుకుంటున్నారు !  

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద బీజేపీ విమర్శల బాణాలు ఎక్కుబెట్టింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విమర్శల బాణాలు వదిలారు. ఈ సందర్భంగా…. ఏపీ ప్రజలను ఉద్దేశించి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా బహిరంగ లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోతుందని తెలిసినా… చంద్రబాబు అనేక యూటర్న్స్ తీసుకున్నారని… అసలు చంద్రబాబు రక్తంలోనే కాంగ్రెస్ ఉందని విమర్శలు చేశారు.

Bjp Cheif Amith Sha Open Letter On Ap People-

Bjp Cheif Amith Sha Open Letter On Ap People

బాబుకి ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ పార్టీలాగే ఆయన కూడా … అనేక అబద్దాలు ఆడుతున్నారన్నారు. ఏపీ లో బాబు కి ఓటమి తప్పదని అనేక అనేక జాతీయ సర్వేలు చెబుతున్నాయని అయినా మహా కల్తీ కూటమిలో బాబు చేరాడని లేఖలో అమిత్ షా విమర్శలు గుప్పించారు.