బిగ్ బాస్ హౌస్ లో మూడవ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ వ్యక్తేనా?

తెలుగులో ఇటీవల మొదలైన బిగ్ బాస్ సీజన్( Bigg Boss season ) సెవెన్ రసవత్తరంగా సాగుతోంది.14 మంది కంటెస్టెంట్లతో గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ షో లో ప్రస్తుతం కేవలం 12 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు.ఇప్పటికే ఇద్దరు లేడీ కంటెస్టెంట్ లో ఎలిమినేట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే.బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి 20 మందికి పైగానే కంటెస్టెంట్లు ఉండొచ్చని అంతా అనుకున్నారు.

 Bigg Boss Season 7 Telugu Third Week Voting Details Here, Bigg Boss Season 7 Tel-TeluguStop.com

కానీ ఎవరూ ఊహించని విధంగా 14 మందిని మాత్రమే హౌస్ లోకి తీసుకొచ్చి ఆట మొదలుపెట్టించారు బిగ్ బాస్.

Telugu Biggboss-Movie

ఇక ఇటీవలె మొదలైన హౌస్ లోకి ప్రియాంక జైన్, సింగర్ దామిని, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, ఆట సందీప్, షకీలా, శోభా శెట్టి, టేస్టీ తేజ, రితిక రోజ్, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.వారిలో ఇప్పటికే కిరణ్ రాథోడ్, షకీలా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు.అయితే బిగ్ బాస్ షో చూస్తుండగానే అప్పుడే మూడో వారం ఎలిమినేషన్స్ కు చేరుకుంది.

ఇక రెండు రోజుల్లో మూడో వారం ఎలిమినేషన్స్ కూడా జరగనున్నాయి.దాంతో ఇప్పుడు బిగ్‌బాస్ మూడో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ షురూ అయింది.

మూడో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.ఈ నేపథ్యంలో తాజాగా ఓటింగ్ రిజల్ట్స్ బయటకి వచ్చింది.

Telugu Biggboss-Movie

సోమవారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి.ఇందులో అమర్ దీప్ చౌదరి( Amardeep Chaudhary ) అత్యధిక ఓటింగ్‌తో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.దాదాపు అతనికి 21 శాతం ఓట్లు పడగా ఆ తర్వాత స్థానంలో ప్రిన్స్ యావర్( Prince Yavar ) ఉన్నాడు.ఆయనకు 19 శాతం ఓట్లు వస్తున్నాయి.ఇక ప్రియాంక 17 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉండగా గౌతమ్ కృష్ణ 16 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.14 శాతం ఓట్లతో రతిక ఐదో స్థానంలో ఉండగా,శుభ శ్రీ 8 శాతం ఓట్లతో ఆరో స్థానంలో ఉంది.దామిని( Damini ) 5 శాతం ఓట్లతో అందరికంటే లీస్ట్‌లో ఉంది.కాబట్టి ఈ ఓటింగ్ గనక ఇలాగే కంటిన్యూ అయితే మూడో వారం బస్ హౌస్ నుంచి దామిని ఎలిమినేట్ అవడం ఖాయం అని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube