తెలుగు బుల్లితెర పేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 షో తాజాగా మొదలయ్యింది.అయితే ఈ బిగ్ బాస్ షో మొదలవ్వకు ముందు వరకు సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల విషయంలో వినిపించిన వార్తలు చాలా వరకు రూమర్స్ అని తేలిపోయింది.
కాగా ఈ బిగ్ బాస్ షో మొదలవ్వకముందు ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్లు వీరే అంటూ అనేక రకాల పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే.తాజాగా సెప్టెంబర్ నాలుగున సాయంత్రం బిగ్ బాస్ షో గ్రాండ్ గా మొదలయ్యింది.
దీంతో ఒక్కొక్క కంటెస్టెంట్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు.
ఇకపోతే బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్రతి సీజన్ లో ఎప్పటిలాగే మోడలింగ్ రంగం నుంచి ఒకరిని, బుల్లితెర సెలబ్రిటీలను, అలాగే కామన్ పీపుల్ ని ఇలా ఒక్కొక్కరిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొని వస్తారు అన్న విషయం తెలిసిందే.
ఇక ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి మోడలింగ్ రంగం నుంచి ఒకరు ఎంట్రీ ఇచ్చారు.కాగా గత సీజన్ లలో అలీ రెజా, అనిల్ రాథోడ్, జెస్సీలో మోడలింగ్ రంగం నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 6 షోలోకి ఈసారి మోడలింగ్ రంగం నుంచి రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చాడు.

కాగా రాజశేఖర్ ఇప్పటికే కల్యాణ వైభోగం,మనసు మమత వంటి సీరియల్స్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతే కాకుండా మేజర్ సినిమాలో కూడా నటించాడు రాజశేఖర్.అయితే మొదట ఆఫీస్ బాయ్ గా కెరిర్ ను ప్రారంభించిన రాజశేఖర్ ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారట.
ఇక గత సీజన్ లో విన్నర్ గా నిలిచిన విజే సన్నీకి రాజశేఖర్ మంచి ఫ్రెండ్ అని తెలుస్తోంది.కాగా ఇప్పటికే గత సీజన్లో మోడలింగ్ రంగం నుంచి ఎంట్రీ ఇచ్చిన కాంటెస్టెంట్ లు మంచి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
మరి రాజశేఖర్ ఏ మేరకు గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి మరి.