Anushka Sharma: విరాట్ కోహ్లీ కంటే ముందే ఆ స్టార్ క్రికెటర్ తో అనుష్క శర్మ ప్రేమాయణం.. ఎవరంటే..?

బాలీవుడ్ నటి అనుష్క శర్మ ( Anushka Sharma ) ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి 2017 లో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరికి 2021 లో వామిక అనే ఒక పాప కూడా జన్మించింది.

 Before Virat Kohli Anushka Sharma Was In Love With That Star Cricketer Who Is I-TeluguStop.com

అయితే అనుష్క శర్మ అలాగే విరాట్ కోహ్లీ ( Virat kohli ) లు పెళ్లికి ముందు చాలా మందితో డేట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే అనుష్క,విరాట్ కోహ్లీ కంటే ముందే మరో స్టార్ క్రికెటర్ ని ప్రేమించి పెళ్లి చేసుకునే వరకు కూడా వెళ్లిందట.

కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదట.మరి ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు? ఎందుకు వీరి పెళ్లి జరగలేదు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

అనుష్క శర్మ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాడ్స్ లో కూడా చేసేది.అలా యాడ్స్ చేసిన సమయంలోనే విరాట్ తో ప్రేమలో పడింది.అయితే అంతకుముందే మరో ఇండియన్ స్టార్ క్రికెటర్ అయినా సురేష్ రైనా ( Suresh raina) తో కూడా సీక్రెట్ గా ప్రేమాయణం సాగించిందట.ఇక వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అనుష్కశర్మ బ్రదర్ కర్నేష్ శర్మ వల్ల.

కర్నేష్ శర్మ కూడా స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్.ఇక ఓ ప్రయివేట్ పార్టీ లో భాగంగా సురేష్ రైనాని కలిసింది అనుష్క శర్మ.

Telugu Anushka Sharma, Bollywood, Karnesh Sharma, Ranbir Kapoor, Suresh Raina, V

ఇక ఆ రోజు నుండి వీరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఫోన్లు మాట్లాడుకునే వారట.ఇక ఆ తర్వాత సురేష్ నైనా అనుష్క శర్మ ( Anushka Sharma ) ని లండన్ కి పిలిపించుకొని మరీ అక్కడ ప్రపోజ్ చేశారట.అయితే ఆయన లవ్ ప్రపోజ్ ని అనుష్క యాక్సెప్ట్ చేయడంతో ఇంట్లో వాళ్లకు కూడా సురేష్ రైనా ఈ విషయం చెప్పారట.ఇక ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో కొద్ది రోజులయ్యాక పెళ్లి చేసుకుంటాను అని అనుష్కకి చెప్పారట.

కానీ అనుష్క మాత్రం ఇప్పుడే పెళ్లి చేసుకుంటే నా సినీ కెరియర్ ఏమైపోతుంది.కొద్ది రోజులు ఆగుదాం అని పెళ్లి విషయం దాటవేసుకుంటూ వచ్చిందట.

Telugu Anushka Sharma, Bollywood, Karnesh Sharma, Ranbir Kapoor, Suresh Raina, V

ఆ తర్వాత కొద్ది రోజులకు రణబీర్ కపూర్ ( Ranbir kapoor ) తో అనుష్క శర్మ ఓ సినిమాలో నటించే సమయంలో వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి సురేష్ రైనా కి కోపం వచ్చి అడగగా అనుష్క శర్మ తలతిక్క సమాధానం చెప్పిందట.దాంతో ఇటు పెళ్లికి ఒప్పుకోకుండా అటు వేరే వాళ్లతో క్లోజ్ గా ఉండేసరికి అనుష్క శర్మ పై కోపంతో ఆమెకు బ్రేకప్ చెప్పి 2015లో ప్రియాంక చౌదరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో చాలా ఆనందంగా ఉన్నారు సురేష్ రైనా.అలా విరాట్ కోహ్లీ కంటే ముందే సురేష్ రైనా తో అనుష్క శర్మ ప్రేమాయణం కొద్ది రోజులు సాగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube