ఈ మధ్య కాలంలో అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి కొంతమంది ఇతరుల మాన, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.కాగా తాజాగా ఓ యువకుడు అక్రమంగా డబ్బు సంపాదించాలనే కోరికతో సోషల్ మీడియా మాధ్యమాలలో అమ్మాయిల ఫోన్ నెంబర్లు తీసుకొని చాటింగ్ చేస్తూ వారిని లోబర్చుకొని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని కడప జిల్లా పరిసర ప్రాంతంలో “సునీల్” అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.అయితే సునీల్ ఈ మధ్య సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉండేవాడు.
ఈ క్రమంలో అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన రావడంతో స్టయిల్ గా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందమైన మహిళలను పరిచయం చేసుకున్నాడు.ఈ క్రమంలో వారితో చాట్ చేస్తూ బుట్టలో వేసుకొని శృంగార క్రీడలు సాగించేవాడు.
అంతేకాకుండా వారితో నగ్నంగా దిగిన ఫోటోలను, వీడియోలను తీస్తూ తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ ఫోటోలను ఇంటర్నెట్లో షేర్ చేస్తానని బెదిరించి మహిళలతో అందినంతా దోచుకున్నారు.
దీంతో తాజాగా కొందరు మహిళలు సునీల్ ఆగడాలు రోజురోజుకీ ఎక్కువ అవుతుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సునీల్ ని అదుపులోకి తీసుకొని విచారించగా తన చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం రాకపోవడంతో డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎన్నుకున్నట్లు పోలీసులు ఎదుట నేరాన్ని అంగీకరించారు.