ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.తెలుగు బాషాభివ్రుద్ది కోసం, తెలుగు ఎన్నారైల కోసం అమెరికాలో స్థాపించబడిన సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టింది.
కేవలం అమెరికాలోని తెలుగు వారికోసమే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం కూడా సేవా , చైతన్య కార్యక్రమాలను చేపడుతూ తమకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకుంది.కరోనా సమయంలో అమెరికాలో తెలుగు వారికోసం, భారతీయుల కోసం తానా చేపట్టిన సహాయ కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయి.
అలాగే.
కరోనా సమయంలో తెలుగు రాష్ట్రాలకు తమవంతు సాయం చేసేందుకు అమెరికాలోని నార్త్ వెస్ట్ మెడికల్స్ వారి సాయంతో సుమారు రూ.25 కోట్ల విలువైన కోవిడ్ సామాగ్రిని విరాళంగా అందించేందుకు సిద్దమయ్యింది.ఎంతో విలువైన సామాగ్రిని జాగ్రత్తగా ఏపీలోని వైజాగ్ కు తరలించింది.
విశాఖ పోర్టుకు చేరుకున్న తరువాత అక్కడ వాతీ సురక్షితంగా ఉంచేందుకు స్థలం లేకపోవడంతో పాటు కస్టమ్స్ క్లియరెన్స్ వచ్చేందుకు సమయాభావం అయ్యింది.ఈ క్రమంలోనే ఈ సామాగ్రిని రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తెలుగు రాష్ట్రాలోని ఇతర ప్రాంతాలకు తరలించి గవర్నర్ చేతుల మీదుగా ఆసుపత్రులకు అందించాలని అనుకున్నారు.
కానీ.
ఊహించని విధంగా కొన్ని రోజుల క్రితం రూ.25 కోట్ల సామాగ్రి మొత్తం కాలి బూడిద అయ్యిపోయింది.తానా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ప్రాజెక్ట్ అగ్నికి ఆహుతి అయ్యిపోవడంతో తానా అలసత్యం వలనే ఈ ప్రమాదం జరిగిందని పుకార్లు కూడా వినిపించాయి.
తానాపై దుష్ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో స్పందించిన తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియదు కాని తానా ఎప్పుడూ పారదర్శకంగా నడుచుకుంటుందని, కాలిపోయిన సంఘటన విషయంలో తాము ఎంతో ఆవేదన చెందుతున్నామని, తెలుగు రాష్ట్రాలకు తాము చేయాలనుకున్న విలువైన సేవలు కాలి బూడిద అయిపోతే మాపై విమర్శలు చేస్తున్నారని అలాంటి వారికి ఏ సమాచారం కావాలన్నా ఇవ్వడానికి తాము సిద్దంగా ఉన్నామని క్లారిటీ ఇచ్చారు.