అవసరాల శ్రీనివాస్.మంచి నటుడిగా.
అంతకు మించి దర్శకుడిగా, మాటల రచయితగా గుర్తింపు పొందాడు.అన్ని రంగాల్లో అందెవేసిన చేయి శ్రీనివాస్ ది.మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు.అష్టా చెమ్మా సినిమాలో నానితో సమానంగా యాక్ట్ చేసి అదరగొట్టాడు.
అనంతరం గోల్కొండ హై స్కూల్, పిల్ల జమిందార్ లాంటి హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడి తన సత్తా చాటుకున్నాడు.
ఈ సినిమా రాశి ఖన్నాతో పాటు నాగ శౌర్యకు బ్రేక్ ఇచ్చింది.డైరెక్టర్ గా గోల్డెన్ నందితో పాటు సైమా అవార్డు సైతం దక్కించుకున్నాడు.
తొలి సినిమా హిట్ తర్వాత నారా రోహిత్, నాగ శౌర్యలతో తీసిన జో అచ్యుతానంద కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది.చక్కటి కథ, కథనంతో పాటు అద్భుతమైన డైలాగులు జనాలను బాగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాకు గాను బెస్ట్ డైలాగ్ రైటర్ గా నంది అవార్డును అందుకున్నాడు.ఆ తర్వాత అవసరాల తీసిన ఓ రొమాంటిక్ మూవీ విమర్శలు ఎదుర్కొంది.
అటు ప్రస్తుతం నాని నటిస్తున్న వి సినిమాలోనే అవసరాల యాక్టర్ గా చేశాడు.ఇందులో తనది కీలకపాత్రగా తెలుస్తోంది.
జనాలకు తెలియన ఓ ఆశ్చర్యకర వార్త ఏంటంటే అవసరా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్లు అతురత పెడుతున్నా దాటేస్తూ వచ్చాడు.ప్రస్తుతం ఆ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఒకప్పుడు అవసరాలకు తీవ్రమైన ఆస్తమా ఉండేది.రోజుకు రెండు మూడు గంటలే నిద్రపోయేవాడు.ప్రాణిక్ హీలింగ్ ద్వారా 95 శాతం రికవరీ అయిన శ్రీనివాస్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు.
ఎలాంటి ఇబ్బందులు లేవు.ఈ నేపథ్యంలో తను పెళ్లి దిశగా అడుగులు వేస్తున్నాడు.
తన కుటుంబ సభ్యులు కూడా ఆయనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట.త్వరలోనే ఓ మంచి అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.