ప్రపంచ కప్ లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం( Arun Jaitley Stadium, Delhi ) వేదికగా నెదర్లాండ్స్ తో ఆస్ట్రేలియా తలపడనుంది.ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు( Australian team ) ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్లలో ఓటమిని చవిచూసింది.
ఆస్ట్రేలియా ఆడిన నాలుగు మ్యాచ్లలో రెండు మ్యాచ్లలో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో ఉంది.ఆస్ట్రేలియా సెమీస్ చేరాలంటే మిగిలి ఉన్న ఐదు మ్యాచ్లలో కచ్చితంగా గెలవాల్సిందే.
నేడు నెదర్లాండ్స్ తో జరిగే మ్యాచ్ ఆస్ట్రేలియాకు ఎంతో కీలకం.ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఆస్ట్రేలియా సెమీస్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి.
అయితే పసికూన నెదర్లాండ్స్ పై ఆస్ట్రేలియా గెలవాలంటే.మ్యాచ్ ఆరంభం నుండి చివరి వరకు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
నెదర్లాండ్స్ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్లలో ఒక మ్యాచ్లో విజయం సాధించింది.ఈ టోర్నీలో అన్ని జట్లకు కంగారు పెడుతున్న సౌత్ ఆఫ్రికా జట్టునే నెదర్లాండ్స్ మట్టికరిపించింది.ఇక పాకిస్తాన్, శ్రీలంక న్యూజిలాండ్ జట్ల చేతిలో ఓడిన గట్టి పోటీని ఇస్తు ప్రత్యర్థి జట్లకు ఇబ్బంది పెట్టింది.కాబట్టి డచ్ జట్టును తేలిగ్గా తీసుకుంటే ఆస్ట్రేలియా జట్టు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
డచ్ జట్టు మ్యాచ్లో చివరి బంతి వరకు ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా గట్టి పోటీని ఇస్తోంది.
ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ ఆటగాళ్లయిన డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్( David Warner, Mitchell Marsh ) జట్టుకు శుభారంభం అందిస్తే మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి తగ్గి ఆశించిన స్థాయిలో జట్టుకు పరుగులు చేరువవుతాయి.ఆస్ట్రేలియా జట్టుకు మిడిల్ ఆర్డర్ వైఫల్యం కంగారు పెడుతోంది.ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్ వెల్, మార్కస్ స్టోయినీస్ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు.
ఈ మ్యాచ్లో వీళ్లంతా రాణించాల్సి ఉంది.ఇప్పటివరకు వన్డేల్లో నెదర్లాండ్స్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడుతూ వచ్చింది.కానీ దక్షిణాఫ్రికా పై గెలవటం, శ్రీలంక జట్టుకు చివరి వరకు గట్టి పోటీ ఇవ్వడం వల్ల నేటి మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టుకు గట్టి పోటీ ఇచ్చి నెదర్లాండ్స్ గెలిచే అవకాశం లేకపోలేదు.