మనం ఒకటి అనుకుంటే తలరాత మరొకటి డిసైడ్ చేస్తుంది అనడానికి మన లైఫ్ లో జరిగే ఘటనలే ఉదాహరణలు.ఇలాంటి తలరాతే కొంత మందిని సినిమా ఇండస్ట్రీలో మంచి నటులుగా తీర్చి దిద్దింది.
అసిస్టెంట్ డైరెక్టర్లుగా, స్టోరీ రైటర్లుగా సినిమాల్లోకి వచ్చి.ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు.
అనుకోకుండా హీరోలుగా మారి.మంచి పొజిషన్ కు వెళ్లారు.
ఇంతకీ అలా వచ్చి.ఇలా ఎదిగిన వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
రవితేజ
తెలుగులో నిన్నే పెళ్లాడుతా, బాలీవుడ్ లో ప్రతిబంద్, ఆజ్ కా గూండారాజ్ మరియు క్రిమినల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన రవితేజ.సింధూరం సినిమాతో స్టార్ అయ్యాడు.తర్వాత నీకోసం, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాతో టాప్ హీరో అయ్యాడు.
నాని
అష్టా చెమ్మ సినిమాతో హీరోగా మారిన నాని.తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా బాపు దగ్గర రాధా గోపాలం సినిమాకు వర్క్ చేశాడు.
వెన్నెల కిషోర్
వెన్నెల సినిమాకు రైటర్ గా పనిచేద్దామని వెళ్లి.అదే సినిమాలో యాక్టర్ అయ్యాడు.కిశోర్ చేసిన రోల్ శివారెడ్డి చేయాల్సి ఉన్నా వీసా క్యాన్సిల్ కావడంతో ఆ రోల్ వెన్నెల కిశోర్ చేశాడు.
పోసాని కృష్ణ మురళి
పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం లాంటి సినిమాకలు రైటర్ గా చేసిన పోసాని. జెమిని, అతడు సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు.
కార్తి
యుగానికి ఒక్కడు, ఆవారా, నాపేరు శివ సినిమాలతో మంచి యాక్టర్ గా ఎదిగిన కార్తి.యువ లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.
తనికెళ్ల భరణి
లేడీస్ టైలర్, శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ ట్రూప్, వారసుడొచ్చాడు, చెట్టుకింద ప్లీడర్, స్వరకల్పన, శివ సినిమాలకు రైటర్ గా పనిచేశాడు.
శ్రీనివాస్ అవసరాల
అష్టాచెమ్మ సినిమాతో యాక్టర్ గా పరిచయం అయిన అవసరాల శ్రీనివాస్.బ్లైండ్ యాంబీషన్ అనే సినిమాకు రైటర్ గా పనిచేశాడు.అనుకోకుండా స్టార్ అయ్యాడు.
జేడీ చక్రవర్తి
శివ సినిమాలో చిన్న నెగెటివ్ రోల్ చేసిన జేడీ.అంతకు ముందు ఆర్జీవీ, కృష్ణ వంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.