Anchor Suma: యాంకర్ సుమ లైఫ్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయా.. రాత్రిళ్ళు మెట్లపై పడుకుని..!!

యాంకర్ సుమ( Anchor Suma ) .షో ఏదైనా ఈవెంట్ ఏదైనా సరే కచ్చితంగా ఈమె ఉండాల్సిందే అంటారు బడా సెలబ్రెటీల నుండి చిన్న సెలబ్రిటీల వరకు.

 Are There So Many Hardships In Anchor Sumas Life Sleeping On The Stairs At Nigh-TeluguStop.com

ఎందుకంటే ఈమె ఆ ఈవెంట్లో లేదా షో లో ఉంటే అక్కడ నవ్వులు పూయించాల్సిందే.తన మాటలతో ప్రతి ఒక్కరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే తన మాటలతో అట్రాక్ట్ చేస్తుంది.అయితే అలాంటి సుమ ( Suma ) జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా అని తాజాగా ఒక విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.

ఇక అసలు విషయం ఏమిటంటే.పండగలు వచ్చేసాయి అంటే మన తెలుగు ఛానల్స్ అన్నీ ఏదో ఒక ఈవెంట్ ని కండక్ట్ చేస్తూనే ఉంటాయి.

Telugu Anchor Suma, Babulgum, Rajeev Kanakala, Roshan-Movie

ఇక దీపావళి రాబోతున్న తరుణంలో ఒక ఈవెంట్ ని చేశారు ఓ ఛానల్ వాళ్ళు.అయితే ఆ ఈవెంట్ కి యాంకర్ సుమ అలాగే ఒకప్పటి నటి యాంకర్ అయిన శిల్పా చక్రవర్తి ( Shilpa chakravarthy ) కూడా గెస్ట్ లుగా వచ్చారు.అయితే ఆ ఈవెంట్లో శిల్పా చక్రవర్తి యాంకర్ సుమ గురించి మాట్లాడుతూ.యాంకర్ సుమ చూడ్డానికి ఇప్పుడిలా సంతోషంగా కనిపిస్తుంది కానీ ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అప్పట్లో ఎన్నో ఇబ్బందులు పడింది.

Telugu Anchor Suma, Babulgum, Rajeev Kanakala, Roshan-Movie

కొన్ని కొన్ని సార్లు సినిమాకి సంబంధించిన ఈవెంట్లైనా లేదా ఇంకా వేరే ఏదైనా షోలు ముగించుకుని వెళ్లేసరికి అర్ధరాత్రి అయ్యేది.అలా వెళ్లి ఇంటి తలుపు కొడితే ఎవరు తీయకపోవడంతో చాలాసార్లు సుమ మెట్ల మీదే పడుకునేది.ఇక అలా సుమా ( Suma ) పడుకోవడం నేను చాలాసార్లు చూశాను అంటూ యాంకర్ సుమ జీవితంలో ఉన్న ఆ విషయం గురించి బయట పెట్టింది శిల్పా.దీంతో సుమ ఒక్కసరిగా కన్నీళ్లు పెట్టుకుంది.

తన జీవితంలో జరిగిన ఆ విషయాలను గుర్తు చేసుకుంది.ఇక తల్లి గొప్పతనం తెలిసిన యాంకర్ సుమ కొడుకు అమ్మను దగ్గరికి తీసుకున్నారు.

యాంకర్ సుమ కొడుకు బబుల్గం ( Babulgam ) అనే సినిమా లో హీరోగా చేస్తున్నారు.ఇక సినిమా ప్రమోషన్స్ కోసమే ఈ ఈవెంట్ కి వచ్చినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube