గ్రామ సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులు 

ఏపీలో టీడీపీ జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఎన్నో మార్పు చేర్పులకు శ్రీకారం చుడుతోంది.ముఖ్యంగా గత వైసిపి ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాలు,  పథకాలు, వాటి పేర్లు మార్పు వంటి వాటిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.

 Ap Government To Make Key Changes In Ap Grama Sachivalayam System Details, Tdp,-TeluguStop.com

  ముఖ్యంగా గత వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన గ్రామ సచివాలయ వ్యవస్థ( Grama Sachivalayam ) విషయంలో తాజాగా టిడిపి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.దీనిలో భాగంగానే సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

  ఇప్పటికే సచివాలయాల్లో సిబ్బందిని ప్రక్షాళన చేయడంతో పాటు, సచివాలయ సిబ్బందిని ఇతర ప్రభుత్వ శాఖల్లోకి పంపేందుకు ఒకవైపు కసరత్తు చేస్తూనే,  మరోవైపు ఈ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది.

Telugu Ap, Apgrama, Janasena, Welfare, Ysrtc-Politics

దీనిలో భాగంగానే గ్రామ సచివాలయాల పేరును మార్చబోతున్నట్లు సమాచారం.  గ్రామ సచివాలయాల పేరును ఇకపై గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్చనున్నట్లు సమాచారం.  గ్రామ సంక్షేమ కార్యాలయంలో డీడీవో గా సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లకు( Welfare Assistants ) ఇవ్వాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.  గ్రామ సంక్షేమ కార్యాలయం ద్వారానే ప్రభుత్వ పథకాలకు( Government Schemes ) సంబంధించి లబ్ధిదారుల గుర్తింపు , జాబితాను తయారు చేయాలని ,

Telugu Ap, Apgrama, Janasena, Welfare, Ysrtc-Politics

ఈ విషయంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు లేకుండా చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామ సంక్షేమ కార్యాలయం ప్రతి గ్రామంలో విడివిడిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ ప్రక్రియ మొత్తం డిసెంబర్ 30 లోపు పూర్తి చేసి అక్టోబర్ రెండు నుండి గ్రామ సంక్షేమ కార్యాలయం నుంచి ఇప్పుడు పనిచేస్తున్న ఐదు మంది ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించే విధంగా విధివిధానాలను రూపొందిస్తోంది.మొత్తంగా గత వైసిపి పాలన ఆనవాళ్లను పూర్తిగా చెరిపేసి , తమ మార్క్ కనిపించే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube