ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.రేపు సాయంత్రం హస్తినకు బయలుదేరనున్నారు.
ఇందులో భాగంగా 28వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు.ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారని సమాచారం.
అదేవిధంగా విభజన హామీలను అమలు చేయాలని మోదీని మరోసారి కోరే అవకాశం ఉంది.అయితే ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు రోజుకో తీరులో మారుతున్న నేపథ్యంలో మోదీ, జగన్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరోవైపు సీఎం జగన్ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది.