యంగ్ టైగర్ ఎన్టీఆర్( Youngtiger NTR ) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్నాడు.ఈయన నందమూరి లెగసీని ముందుకు నడిపిస్తూనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే ఎన్టీఆర్ కు నందమూరి కుటుంబానికి మధ్య గత కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయని టాక్ వినిపిస్తూనే ఉంది.ఇది అందరికి తెలిసిన నిజం.
అయినా ఎన్టీఆర్ ఈ వార్తలను పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారు.ఆయన తాత ఎన్టీఆర్ కు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతారు.మిగిలిన వాటికీ దూరంగా ఉంటుంటారు.ఎన్టీఆర్ ఇలా తన పని తాను చేసుకుంటున్న కూడా ఈయనపై అప్పుడప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి.తాజాగా ఏపీ రాజకీయాలను చంద్రబాబు అరెస్ట్ షేక్ చేస్తుంది.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) అరెస్ట్ కావడంపై ఆయన అభిమానులు, పార్టీ నేతలు గరంగరంగా ఉన్నారు.
ఇంత జరుగుతున్న ఎన్టీఆర్ ఏ మాత్రం స్పందించకపోవడంతో ఆయనపై కూడా ఫైర్ అవుతున్నారు.కొంత మంది ఏకంగా నీ పేరు కూడా మార్చుకో అంటూ పోస్టులు చేస్తుండడం షాక్ ఇస్తుంది.
ఈ క్రమంలోనే ఈయనను సపోర్ట్ చేస్తూ యాంకర్ శ్యామల ( Anchor Shyamala ) ఒక పోస్ట్ చేయగా ఇది వైరల్ అవుతుంది.
”ఒకసారి నమ్మి మోసపోయాడు.రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకుంటున్నాడు.తన నటనతో ఇప్పుడిప్పుడే ప్రపంచం చూపు తనవైపు తిప్పుకుంటున్నాడు.
అలా ప్రశాంతంగా వదిలేయండి.మనకు అనుకూలంగా ఉంటేనే వాళ్ళ బాగు కోరుకుంటాం, లేకపోతే అంతే అనడం ఎంత వరకు సబబు అన్నా.
అంటూ ఈమె చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.