'పుష్ప 2' నుండి క్రేజీ డైలాగ్ చెప్పిన బన్నీ.. అదే పుష్పగాడి రూల్ అంటూ..

టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ”పుష్ప ది రూల్” ఒకటి.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ఇది.

 Allu Arjun Leaks Fiery Pushpa 2 Dialogue At Baby Success Meet, Baby Success Meet-TeluguStop.com

ఇప్పటికే పార్ట్ 1 ఘన విజయం సాధించడంతో పార్ట్ పై అన్ని అంచనాలు పెరిగాయి.ఇక పార్ట్ 2 స్టార్ట్ చేసి అప్పుడే చాలా భాగం షూట్ పూర్తి చేసారు.

ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

మన సౌత్ ప్రేక్షకుల కంటే కూడా నార్త్ ప్రేక్షకులు పుష్ప ది రూల్ సినిమాపై ఇంకా ఆసక్తిగా ఉన్నారు.

మరి అలాంటి సినిమా నుండి ఏ చిన్న విషయం లీక్ అయిన కూడా ఆడియెన్స్ కు పండుగే.స్వయంగా ఐకాన్ స్టార్ నే ఒక విషయం లీక్ చేసి ఫుల్ సర్ప్రైజ్ చేసాడు.తాజాగా అల్లు అర్జున్ బేబీ సినిమా( Baby movie ) ప్రశంస సామావేశంలో పాల్గొన్నారు.

ఇక్కడ పలు ఆసక్తికర విషయాల గురించి ఆయన మాట్లాడారు.ఇక అక్కడే ఒక చిన్న డైలాగ్ ను పుష్ప 2 నుండి లీక్ చేసారు.,/br>

ఈయన మాట్లాడుతూ.”ఇక్కడ అంతా కూడా ఒకటే రూల్ మీద జరుగుతుండాది.అదే పుష్ప గాడి రూల్” అంటూ ఈయన చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయ్యింది.కాగా ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube