నిర్మల్ జిల్లాలో ఉన్న కడెం ప్రాజెక్టు ప్రమాదపు అంచుల్లో ఉందని తెలుస్తోంది.ఓ వైపు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండగా మరోవైపు ప్రాజెక్టు ఆరు గేట్లు మొరాయిస్తున్నాయి.
దీంతో మాన్యువల్ గా గేట్లను ఎత్తేందుకు అధికారులు, సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.అయితే తేనెటీగలు ఆటంకం కలిగిస్తున్నాయి.
కడెం ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో ఉండటంతో 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.కాగా ఈ గేట్లను ఎత్తే సమయంలో మొరాయించడంతో ఇబ్బంది తలెత్తుతోందని తెలుస్తోంది.