ఇటీవల కాలంలో అల్లు అర్జున్ ( Allu Arjun )పేరు సోషల్ మీడియాలో మారుమగుతున్న విషయం తెలిసిందే.అందుకు గల కారణం సంధ్యా థియేటర్( Sandhya theater ) ఘటన.
ఇప్పటికీ ఎన్నో రకాల విమర్శలను సైతం ఎదుర్కొన్నారు అల్లు అర్జున్.గతఏడాది ఈ విషయాలతో సతమతమయ్యారు బన్నీ… ఇది ఇలా ఉండే తాజాగా అల్లు అర్జున్ కి ఒకేసారి రెండు సంతోషాలు కలిసి వచ్చాయి.
ఒకటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నమోదైన కేసులో రెగ్యులర్ బెయిల్ వచ్చింది.మరోవైపు అల్లు అర్జున్ నటించిన పుష్ప టు సినిమా హిందీలో ఏకంగా 800 కోట్ల రూపాయలను( 800 crore rupees ) సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది.
ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఈ ఏడాది ఆరంభంలోనే బన్నీకి రెండు విషయాలు కలిసి వచ్చాయి.దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.కాగా పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన రేవతి ( Revathi )అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.దీనిపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ను ఏ 11 నిందితుడిగా చేర్చారు.
బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా.అదే టైమ్ లో హైకోర్టుకు ( High Court )వెళ్లి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్.
అయినప్పటికీ ఒక రాత్రి జైలు జీవితం గడపాల్సి వచ్చింది.
అలా మధ్యంత బెయిల్ పై బయటకొచ్చిన అల్లు అర్జున్ కు, నాంపల్లి కోర్డులో ఈరోజు రెగ్యులర్ బెయిల్ దొరికింది.బన్నీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు.50వేల రూపాయల విలువైన 2 పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు, సాధారణంగా రెగ్యులర్ బెయిల్ పై విధించే షరతులన్నింటినీ అల్లు అర్జున్ కు విధించింది.రెగ్యులర్ బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్, సాక్ష్యుల్ని ప్రభావితం చేయకూడదు.కేసును ప్రభావితం చేసేలా బహిరంగంగా మాట్లాడకూడదు.పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలి.ఈ షరతులతో అతడికి బెయిల్ వచ్చింది.
ఇక మరొకవైపు పుష్ప 2 సినిమా బన్నీకి ఒక అరుదైన, ఘనమైన రికార్డును కట్టబెట్టింది.ఈ సినిమా హిందీ వెర్షన్ ఏకంగా 800 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది.
ప్రస్తుతం ఈ సినిమా నెట్ వసూళ్లు 798 కోట్ల రూపాయలు.ఇటు బెయిల్ వచ్చే సమయానికి, అటు ఈ సినిమా 800 కోట్ల నెట్ వసూళ్లు కచ్చితంగా కలెక్ట్ చేసి ఉంటుంది.