భార్య పిల్లలతో కలిసి వరుణ్ పెళ్లి కోసం ఇటలీ బయలుదేరిన అల్లు అర్జున్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) నటి లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ) నవంబర్ ఒకటవ తేదీ ఎంతో ఘనంగా పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే.మిస్టర్ సినిమాలో కలిసి నటించిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు.

 Allu Arjun Family Is Going To Italy Photos Goes Viral, Allu Arjun, Snehareddy, I-TeluguStop.com

ఇక అప్పటినుంచి వీరి ప్రేమ విషయం రహస్యంగా ఉంచి చివరికి జూన్ 9వ తేదీ నిశ్చితార్థం చేసుకోబోతున్నాం అంటూ ప్రకటించారు.ఇలా ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.

నవంబర్ ఒకటో తేదీ ఇటలీలో( Italy ) వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఒక్కొక్కరు ఇటలీ చేరుకుంటున్నారు.

Telugu Allu Arjun, Italy, Sneha, Varun Tej-Movie

నవంబర్ ఒకటవ తేదీ పెళ్లి జరగబోతున్నటువంటి నేపథ్యంలో సమయం చాలా తక్కువగా ఉంది.ఇప్పటికే నాగబాబు కుటుంబ సభ్యులతో పాటు లావణ్య కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీ చేరుకున్నారు.ఈ క్రమంలోనే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇటలీ బయలుదేరుతున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి ఇటలీ బయలుదేరి వెళ్లారు.ఈ క్రమంలోనే తన భార్యతో ఈయన ఎయిర్ పోర్టులో ఉన్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun )సైతం తన ఫ్యామిలీతో కలిసి ఇటలీ వెళ్లారని తెలుస్తుంది.

Telugu Allu Arjun, Italy, Sneha, Varun Tej-Movie

అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి ( Sneha Reddy ) అలాగే తన పిల్లలు అయాన్ అర్హ నలుగురు ఇటలీ వెళ్లారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా మెగా కుటుంబంలో జరుగుతున్నటువంటి ఈ పెళ్లి వేడుకలలో భాగంగా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటున్న సంగతి తెలిసిందే.అందుకే మెగా హీరోలు అందరూ కూడా తమ సినిమాలో షూటింగ్ పనులకు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చి ఇటలీ బయలుదేరారు.

ఇలా ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట తిరిగి నవంబర్ 5వ తేదీ హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తుంటే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube