సుకుమార్‌కు డెడ్‌లైన్.. పెట్టింది ఎవరంటే?

లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోగా, ఇటీవల షూటింగ్‌లు తిరిగి ప్రారంభించుకునేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.అయితే కొంతమంది నిర్మాతలు మాత్రమే తిరిగి షూటింగ్‌లు ప్రారంభించారు.

 Allu Arjun Deadline To Sukumar, Allu Arjun, Sukumar, Pushpa, Koratal Siva-TeluguStop.com

కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోవడం, రోజురోజుకూ తీవ్రత పెరిగిపోతుండటంతో షూటింగ్‌లను తిరిగి ప్రారంభించేందుకు చాలామంది నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు.షూటింగ్ జరపాలంటే చాలామంది టెక్నీషియన్స్ ఉంటారు.

అంతమందిలో సోషల్ డిస్టెన్స్ పాటించడం కుదరదని నిర్మాతలు చెబుతున్నారు.

అయితే లాక్‌డౌన్ వల్ల సుకుమార్ డైరెక్షన్‌లో స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా షూటింగ్ ఆగిపోగా.

వీలైనంత త్వరగా ఆ సినిమాను పూర్తి చేయాలని సుకుమార్‌పై అల్లు అర్జున్ ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.పుష్ఫ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ నటించాల్సి ఉంది.

దీంతో పుష్ప సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తైతే.కొరటాల శివ సినిమా చేయవచ్చని అల్లు అర్జున్ భావిస్తున్నాడు.

ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవితో ఆచార్య అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఆచార్య సినిమా కూడా ఆలస్యం కావడంతో తన సినిమా కోసం కొరటాలను వెయిట్ చేయించకూడదనే ఆలోచనలో బన్నీ ఉన్నాడు.

దీంతో పుష్ప సినిమాను వెంటనే పూర్తి చేయాలని సుకుమార్‌ను బన్నీ కోరుతున్నాడట.కానీ సుకుమార్ ఒక సినిమా తీసేందుకు చాలా ఎక్కువ సమయం తీసుకుంటాడు.పుష్ప సినిమాలో బ్రాక్‌డ్రాప్ సీన్లు చాలా ఉండటం, సుకుమార్ వర్కింగ్ స్ట్రైల్‌ని బట్టి చూస్తే.ఆ సినిమా షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube